KUSHI:వీకెండ్ కుమ్మింది కానీ.. ఇప్పుడే అసలు దమ్మెంతో తెలిసేది?

kushi:

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన ఖుషి ఆడియన్స్ దగ్గర మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుందని తెలిసిందే. లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ముందునుండి భారీ అంచనాలు ఉండేవి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. విజయ్, సమంత కాంబో ఒకటి అయితే, శివ నిర్వాణ డైరెక్షన్ మరొకటి. అయితే అన్నిటికీ మించి ఈ సినిమాకి పాటలు చాలా పెద్ద ప్లస్ అయ్యాయి. దానికితోడు థియేటర్ల వద్ద మరే సినిమా కూడా పోటీగా రిలీజ్ కాలేదు.

అందుకే ఖుషి భారీ ఓపెనింగ్స్ అందుకుంది. ఫస్ట్ డే విజయ్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకోగా, ఆ తర్వాత కూడా మంచి హోల్డ్ ని కొనసాగించింది. తాజాగా ఫస్ట్ వీకెండ్ లెక్కలు వచ్చేసాయి. ఫస్ట్ డే 15కోట్లకి పైగా షేర్ సాధించిన ఈ సినిమా రెండు, మూడు రోజులు కలిపి మరో 16కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా 32 కోట్లకి పైగా షేర్ సాధించిన ఖుషి, 60కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. అయితే వీకెండ్ సెలవుల్లో బాగానే వచ్చినా, ఇప్పుడే ఖుషికి అసలు పరీక్ష స్టార్ట్ అయింది.

దాదాపు 53కోట్ల బిజినెస్ చేసిన ఖుషి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 20కోట్లయినా రాబట్టాలి. అయితే తెలుగురాష్ట్రాల్లో వర్షాల ప్రభావం వల్ల వసూళ్లకు కొంచెం బ్రేక్ పడే అవకాశం ఉంది. అయితే టాక్ ని బట్టి ఖుషి లాంగ్ రన్ లో జోరు చూపించే అవకాశం ఉంది. అయితే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది గాని, బయ్యర్లకి లాభాలు మాత్రం పెద్దగా రాకపోవచ్చని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఖుషి ఫస్ట్ వీక్ ముగిసేసరికి ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు