Mama mashchindra : హీరో సుధీర్ బాబు నాన్న ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

టాలెంట్ ఉన్న టైం బాగాలేని హీరోల్లో ముందు వరుసలో ఉన్న హీరో సుదీర్ బాబు. సినిమా పట్ల ప్యాషన్, క్యారెక్టర్ కోసం ఏమైనా చేసే డెడికేషన్ ఉన్న కాలం కలిసి రాకా ఈ హీరో ప్రస్తుతం వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమైపోతున్నాడు.

ఎస్ఎంఎస్ సినిమాతో హీరోగా పరిచమైన ఈ యంగ్ హీరో మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక తరువాత మారుతీ సమర్పణలో వచ్చిన ప్రేమ్ కథ చిత్రమ్ అనే హారర్ సినిమాలో నటించి, వైవిధ్యమైన పాత్రలలో, సినిమాలలో నటించే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తరువాత మళ్ళీ కమర్షియల్ సినిమాల వైపు మొగ్గు చూపడంతో సుధీర్ బాబు కెరీర్ చిక్కుల్లో పడింది. చేతికందిన సినిమాలు చేస్తూనే ఉన్న ఆశించినంత సక్సెస్ మాత్రం రాకుండా పోయింది.

అయితే ఈ మధ్య కాలంలోనే ఈ హీరో కాస్త రూట్ మార్చి మళ్ళీ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం స్టార్ట్ చేసాడు. గత జనవరిలో వచ్చిన హంట్ సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. మలయాళంలో సూపర్ హిట్టైన ముంబై పోలీస్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచి సుధీర్ బాబుకి షాక్ ఇచ్చింది.

- Advertisement -

ప్రస్తుతం సుధీర్ బాబు ప్రముఖ యాక్టర్ హర్షవర్ధన్ డైరెక్షన్ లో మామా మశ్చీంద్రా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలనే షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా తొందర్లోనే విడుదలకి సిద్ధమవుతోంది. ఈ సినిమాతో పాటు సుధీర్ బాబు “మా నాన్న సూపర్ హీరో” అనే మరో ఫాదర్ సెంటిమెంట్ సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈరోజు రిలీజ్ చేసారు. లూజర్ సిరీస్ డైరెక్ట్ చేసిన అభిలాష్ రెడ్డి కంకర ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ విధంగా కమర్షియల్ సినిమాలని , మరో పక్క కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని బ్యాలన్స్ చేస్తున్న ఈ హీరోని ఈసారైనా అదృష్టం వరిస్తుందో లేదో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు