Prabhas: ఈ ఒక్క పాత్ర కోసం ఆదిపురుష్ ని చూసేయ్యొచ్చు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” ఎన్నో అంచనాలతో జూన్16 న విడుదలైన విషయం తెలిసిందే. రామాయణం ఆధారంగా వచ్చిన ఈ మైథలాజికల్ మూవీ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన ని దక్కించుకుంది. చాలా ఏళ్ళ తర్వాత వస్తున్న పౌరాణిక చిత్రం అయిందందువల్ల ప్రేక్షకులు ఎంతో వెయిట్ చేసారు. కానీ దర్శకుడు ఓం రౌత్ అభిమానుల అంచనాలను అందుకోకపోవడమే గాక రామాయణ ఇతిహాసాన్ని అల్ట్రా మోడ్రన్ పేరుతో ఇష్టం వచినట్టు తీసి ప్రేక్షకుల ఆగ్రహానికి లోనయ్యాడు.

చాలా రోజుల నుండే రామాయణ గాథను నేటి తరానికి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తీశామని చెప్తూ వచ్చిన చిత్ర యూనిట్ ఇప్పుడు ఏకంగా ఆదిపురుష్ రామాయణం కథ తీసుకుమని రాయలేదని మాట మార్చేశారు. రామాయణం కథను ఇష్టమొచ్చినట్టు తీసి ఇప్పుడు దొరక్కూడదని మాట మారుస్తూ ప్రగల్బాలు పలికితే ఊరుకునేది లేదని ఫ్యాన్స్ కూడా వార్నింగ్ ఇస్తున్నారు.

ఆదిపురుష్ లో పాత్రలకు ప్రజలు ఎక్కువగా మాట్లాడే పేరు పెట్టకుండా చేయడమే గాక, ఆ పాత్రల స్వభావాన్ని కూడా సరిగా ఎలివేట్ చేయలేక తప్పు తప్పుగా చూపించాడు. రాముడిని సౌమ్యుడిగా చూపించడం కంటే ఎక్కువ దృష్టి యుద్ధ సన్నీవేషాల్లో వీరుడిగా చూపించడానికే శ్రద్ధ పెట్టాడు. ఇలా చూపించడం ప్రభాస్ ఫ్యాన్స్ కి కూడా అంతగా నచ్చలేదు.

- Advertisement -

సీత పాత్ర కైతే స్క్రీన్ స్పేస్ కూడా తక్కువ పెట్టగా, రాముడితో ఎక్కువ సేపు చూపించనేలేదు. ఇక లక్ష్మణుడి పాత్ర సినిమా మొత్తం ఉన్నా డైలాగ్స్ మాత్రం చాలా తక్కువ. ఇక రావణుడి పాత్ర గురించి చెప్పేనే అక్కర్లేదు. ఆ గెటప్ నే దారుణంగా చూపించిన దర్శకుడు కనీసం న్యాచురల్ గా చూపించకుండా ఏదో ఇంగ్లీష్ సినిమాల్లో విలన్ లాగా చూపించాడు.

అయితే ఈ సినిమాలో అందరికంటే బాగుండి, మంచి స్క్రీన్ స్పేస్ దక్కించుకుని హైలెట్ అయిన పాత్ర ఏదైనా ఉంది అంటే అది “హనుమాన్” పాత్ర. స్వతహాగా హనుమాన్ ని చిన్న పిల్లలు సైతం చాలా ఇష్టపడతారు. ఆయన్ని ఒక సూపర్ హీరోగా భావిస్తారు పిల్లలు. అందుకే ఈ పాత్ర సినిమాలో ఇంట్రీ ఇవ్వగానే హీరో ఎంట్రీ కి మించిన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో చాలా పాజిటివ్ గా ఉండి, గెటప్ పరంగా కూడా న్యాచురల్ గా ఉన్న పాత్ర ఇదొక్కటే. అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ బాగాలేకపోయినా జనాలు చూసారు. ఎంట్రీ నుంచి క్లైమాక్ వరకు హైలెట్ అయిన పాత్ర ఇదొక్కటే. కాకపోతే ఈ సినిమాలో హనుమాన్ అన్న పదం వాడకుండా భజరంగ్ అనే ఆ పాత్ర పేరుని పలికించడం జరిగింది.

ఇక ఈ పాత్రలో నటించిన మరాఠీ నటుడు దేవదత్త నాగే అద్భుతమైన నటనని కనబరచడమే గాకుండా స్క్రీన్ ప్రెజన్స్ లోను ఆకట్టుకున్నాడు. అయితే ఆదిపురుష్ సినిమాలో ఏమి లేకపోయినా ఈ ఒక్క పాత్ర కోసం చుసేయొచ్చని నెటిజన్స్ అంటున్నారు. ఇక ఇప్పటికే 200కోట్లకి పైగా వసూలు చేసిన ఆదిపురుష్ మూడు వందల మార్క్ దిశగా దూసుకుపోతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు