Saidharam tej: “బ్రో” లో ఆ పాట కోసం సూపర్ ట్యూన్స్ ఇచ్చిన థమన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న “బ్రో” సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తిగాపోయిన ఈ సినిమాకు చిన్న చిన్న బిట్ సీన్లు మాత్రమే బాకీ ఉన్నాయని చిత్ర యూనిట్ సమాచారం ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ భారీ హైప్ క్రియేట్ చేయగా, త్వరలోనే టీజర్ రిలీజ్ కి రెడీ అవుతుంది. బహుశా జూన్ నాలుగో వారంలో ఈ సినిమా టీజర్ ని విడుదల చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా బ్రో మూవీ నుండి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకి సంబంధించి థమన్ ఇప్పటికే అన్ని పాటలను రెడీ చేయగా ఆ పాటలను షూట్ చేయడం కూడా అయిపొయింది. అయితే ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్, కేతికా శర్మ పై ఒక పాట చిత్రీకరణ కోసం అద్భుతమైన ట్యూన్ థమన్ ఇచ్చాడట. ఆ పాట ఒక మెలోడీ సాంగ్ గా ఉంటుందట. ఆ ట్యూన్స్ విన్న కొంత మంది ట్రేడ్ విశ్లేషకులు ఈ సంవత్సరం బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. విడుదలయ్యాక సోషల్ మీడియాలో సాంగ్ వైరల్ కావడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక “బ్రో” సినిమా జులై28న విడుదలకు రెడీ అవుతుండగా,ఈ సినిమాకి సంబంధించి అన్ని పనులు దగ్గరుండి త్రివిక్రమ్ చూసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వివేక్ కూచిబొట్ల నిర్మించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు