Boxoffice: అంతా అయిపోయిందన్నారు. రెండో రోజు నాన్ RRR రికార్డు అవుట్ అక్కడా!

పాన్ ఇండియా మూవీ జూన్16 న వరల్డ్ వైడ్ గా విడుదలై మిశ్రమ స్పందన ని రాబట్టుకుందన్న విషయం తెలిసిందే. రామాయణాన్ని నేటి తరానికి అనుగుణంగా చిన్న మార్పులు చేసి తెరకెక్కించగా ప్రేక్షకుల నుండి నెగిటివ్ రెస్పాన్స్ నే రాబట్టుకున్నా కూడా విడుదలైన మొదటి రోజు అనుకున్నట్టుగానే భారీ ఓపెనింగ్స్ ని కొల్లగొట్టింది. డే 1 వరల్డ్ వైడ్ ఆ 137 కోట్లకి పైగా గ్రాస్ ని 70కోట్లకి పైగా షేర్ ని వసూలు చేసింది.

అయితే ఆదిపురుష్ సినిమాకు అన్ని చోట్ల నెగిటివ్ స్పందన వచ్చిన కారణంగా రెండో రోజుతోనే ఈ సినిమా డల్ అయిపోతుందని కలెక్షన్స్ వేళ్ళమీద లెక్కబెట్టొచ్చని నెటిజన్స్ అన్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రభాస్ తన క్రేజ్ ఏంటో చూపించాడు. ఆదిపురుష్ విడుదలైన రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా నాన్ RRR రికార్డు క్రియేట్ చేసాడు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ తర్వాత ఉన్న బాహుబలి2(14.84cr) ని చిన్న మార్జిన్ తో బ్రేక్ చేసి చరిత్ర సృష్టించాడు.

రెండో రోజు ఆదిపురుష్ ఏపీ, నైజాంలో 15 కోట్ల 4లక్షల షేర్ ని వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా రెండో రోజు 38.39 కోట్ల కి పైగా షేర్ సాధించగా, 77 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకి ఉన్న నెగిటివ్ రెస్పాన్స్ తో ఈ రేంజ్ వసుళ్లంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమాకు 242 కోట్ల బిజినెస్ జరగ్గా, రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 108కోట్ల షేర్ ని 214 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ అవ్వడానికి ఇంకా 133 కోట్లు కావాలి. మూడు రోజు ఆదివారం వీకెండ్ కావడంతో మళ్ళీ జోరు చూపించే అవకాశం ఉంది. మరి చూడాలి ఈ టాక్ తో మూడో రోజు ఎలాంటి ఓపెనింగ్స్ సాధిస్తుందో.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు