Khushi : సమంతతో రిలేషన్షిప్ పై ఓపెన్ అయిన ప్రీతమ్ జుకాల్కర్..!

అక్కినేని నాగచైతన్య, సమంత రుత్ ప్రభూ విడాకుల వెనక వినిపించిన ప్రధాన కారణాలలో ప్రీతమ్ జుకాల్కర్ ఒకరు. సమంత పర్సనల్ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ అయిన ప్రీతమ్ తో సమంత సన్నిహితంగా ఉంటున్నారని, ఇది నచ్చని నాగచైతన్య విడాకులు ఇచ్చారన్న వార్తలు అప్పట్లో గట్టిగా వినిపించాయి. విడాకుల తరువాత కూడా ప్రీతమ్ జుకాల్కర్ తో సమంత క్లోజ్ గా ఉంటుందని వార్తలు వినిపించాయి.

ఈ వార్తలను అటు సమంత, ఇటు ప్రీతమ్ ఖండించారు. అయిన ఆ రూమర్స్ ఆగలేదు. తరచూ ఈ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ రూమర్స్ పై తాజాగా ప్రీతమ్ స్పందించారు. తాజాగా యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ.. “తెలిసిన వారు, కాస్త సన్నిహితంగా ఉన్నవారు ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడం అనేది కామన్. నేను అదే పని చేశాను.

సమంత క్లోజ్ కావడంతో ఆమెకు అండగా ఉన్నాను. అంతేకానీ మా మధ్య ఏం లేదు. బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉంది. నేనేంటో నాగచైతన్యకి కూడా తెలుసు. వారి ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకునేవారు. మా మధ్య మంచి రిలేషన్ ఉంది. దీన్ని కొందరు తప్పు పట్టడం చాలా బాధ అనిపించేది. నేను చాలా అగ్రెసివ్ పర్సన్. నాపై రూమర్స్ వస్తే తట్టుకోలేను. నన్ను ఒక చెంప దెబ్బ కొడితే 10 దెబ్బలు కొట్టే రకం. నాపై కామెంట్ చేయడానికి వాళ్ళు ఎవరంటూ ప్రశ్నించే వాన్ని. కానీ ఇలా రియాక్ట్ అయితే అది నీ కెరీర్ కి ఎఫెక్ట్ అవుతుందని కొందరు హెచ్చరించారు. దీంతో నా బాధ బయటకు చెప్పుకోలేదు. లోపల చాలా బాధపడ్డాను. నా స్థానంలో వేరొకరు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారు. దయచేసి నిజా నిజాలు తెలుసుకోకుండా ఎవరిని టార్గెట్ చేయొద్దు” అని చెప్పుకొచ్చాడు ప్రీతమ్.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు