Chatrapati : బెల్లంకొండ శ్రీనివాస్ నెక్స్ట్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇటీవలనే ఈయన హీరోగా నటించిన ఛత్రపతి సినిమా రిలీజై, బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం చెందటంతో నెక్స్ట్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తునట్టు తెలుస్తోంది.

అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచమైన బెల్లంకొండ శ్రీనివాస్ ప్రముఖ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కొడుకు అనేది అందరికి తెలిసిందే. మొదటి సినిమానే వివి వినాయక్ దర్శకత్వంలో హీరోగా నటించి గ్రాండ్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. అయితే సినిమా కూడా అంతే గ్రాండ్ గా రిలీజై, బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక అల్లుడు శ్రీను సినిమా హిట్ తో వరుస సినిమాలు చేసిన ఈ యంగ్ హీరోకి సాలిడ్ సక్సెస్ ఇప్పటి వరకు రాలేదనే చెప్పాలి.

అయితే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన తెలుగు సినిమాలన్నీ హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తుండటంతో ఈ యంగ్ హీరో హిందీ ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. రికార్డ్ బ్రేకింగ్ వ్యూవర్షిప్ తో ఆయన సినిమాలు హిందీలో పాపులర్ అయ్యాయి. తెలుగులో అనుకున్నంత సక్సెస్ లేకపోవడంతో హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఇటీవలనే ఛత్రపతి సినిమాతో బాలీవుడ్ కు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా 2005లో రాజమౌళి -ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి సినిమాకి రీమేక్.

- Advertisement -

ఈ సినిమా గనక హిట్ అయితే బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా చెలామణి అయ్యేవాడు. కానీ భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ఎవ్వరు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఇక బాలీవుడ్ కి బ్రేక్ చెప్పి, ప్రస్తుతం భీమ్లా నాయక్ మూవీ ఫేం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి గాను టైసన్ నాయుడు అనే పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఛత్రపతి ఇచ్చిన ఫ్లాప్ ని ఈ సినిమాతో పూర్తి చేయాలనీ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్. మరీ ఈ సినిమాతోనైనా బెల్లంకొండ శ్రీనివాస్ సాలిడ్ హిట్ కొడతాడో, లేదో చూడాలి

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు