Arcus Films: సరికొత్త ప్రమోషన్లతో జోరు చూపిస్తున్న చిత్ర యూనిట్

టాలీవుడ్ లో స్కైఫై నేపథ్యంలో తెరకెక్కిన తాజా చిత్రం “7:11PM“. సాహస్ పగడాల హీరోగా, టెస్ వాల్ష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను అర్కస్ ఫిల్మ్స్ బ్యానర్ లో నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమాని చైతు మాదాల దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేయగా త్వరలోనే ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నారు.

పూర్తిగా కొత్తవాళ్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏ హడావిడి లేకుండా ఒక్క టీజర్ తోనే ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు అప్పుడే స్టార్ట్ చేయగా ఏకంగా ఫారిన్ నుంచే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేసారు. ఈ సినిమా లో పలువురు ఇంగ్లీష్ నటులు కూడా నటించడం వల్ల సినిమాను కూడా అక్కడనుంచే ప్రమోట్ చేయాలనీ చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మూవీ టీమ్ రిలీజ్ చేసిన ఒక ప్రమోషనల్ వీడియో ఫన్నీ గా ఉండి ఆకట్టుకుంటుంది. ఇక టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 30న విడుదల చేస్తున్నామని మూవీ యూనిట్ ఇంతకుముందే ప్రకటించడం జరిగింది.

ఇక ఈ సినిమాకు శివ శంకర్, ఫాబియో కాపోడివెంటో సినిమాటోగ్రఫీ అందించగా, ఓం రమేష్ గ్రాఫిక్స్ అందించాడు. ఒకే టైమ్ లో రెండు చోట్ల ట్రావెల్ చేసే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కగా, ఈ సినిమాకు గ్యాని సంగీతం అందించాడు. అయితే జూన్ 29న విడుదలవుతున్న “స్పై”, “సామజవరాగమన” చిత్రాల పోటీని తట్టుకుని నిలబడాలంటే సాలిడ్ హైప్ రావాల్సి ఉంటుంది. మరి రిలీజ్ డేట్ వచ్చే లోపల తమ ప్రమోషన్లతో సినిమాపై ఏ విధమైన అంచనాలు పెంచుతారో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు