Rakul Wedding : రకుల్ ఏంటిది? స్టార్ ను చేసిన తెలుగు స్టార్స్ ను పెళ్లికి పిలవలేదా?

గత కొంతకాలం నుంచి ప్రేమలో మునిగితేలుతున్న లవ్ బర్డ్స్ రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ ఈరోజు పెళ్లి జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. గోవా వేదికగా జరుగుతున్న వీరి పెళ్లి వేడుకలకు హాజరవ్వడానికి అతిథులంతా అక్కడకు చేరుకుంటున్నారు. అయితే రకుల్ తన పెళ్లికి ఆహ్వానించిన సెలబ్రిటీలు అందరూ బాలీవుడ్ కు చెందిన వారే కావడం గమనార్హం. లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ ను రకుల్ మర్చిపోయిందా? తెలుగు స్టార్స్ లో ఎవరెవరికి రకుల్ పెళ్లికి ఆహ్వానం అందింది? అనే వివరాల్లోకి వెళితే…

ఫిబ్రవరి 21న గోవాలోని ఐటీసీ గ్రాండ్ అనే రీసార్ట్ లో రకుల్, జాకీలా పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. వీరి పెళ్లి వేడుక రెండు పద్ధతుల్లో జరగబోతోంది. ఇరు కుటుంబ సభ్యులకు సంబంధించిన రెండు సాంప్రదాయాలు ఆనంద్ కరాజ్, సింధి శైలిలో వివాహం జరగబోతోంది. వీళ్ళ పెళ్లికి అతి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, ఈషా డియోల్, టైగర్ ష్రాఫ్, సోనం కపూర్, రితీష్ దేశ్ ముఖ్, షాహిద్ కపూర్, భూమి పెడ్నేకర్, ఆనంద్ అహుజా, వరుణ్ ధావన్ వంటి వారికి రకుల్ పెళ్ళికి ఆహ్వానం అందింది. వీళ్లతో పాటు టీవీ నటులు స్మృతి ఖన్నా, ఆమె భర్త గౌతం గుప్తాలకు కూడా రకుల్, జాకీల పెళ్లికి ఇన్విటేషన్ అందినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ గెస్టులు అందరూ ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు జరగబోతున్న రకుల్, జాకీల పెళ్లి కోసం వివాహ వేదిక వద్దకు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. అయితే టాలీవుడ్ నుంచి ఈ బ్యూటీ ఒక్క స్టార్ హీరోని కూడా ఆహ్వానించకపోవడం గమనార్హం.

తెలుగు సెలబ్రిటీల్లో మంచు లక్ష్మి, హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ మాత్రమే తమ స్నేహితురాలు రకుల్ పెళ్ళిలో మెరవబోతున్నారు. అయితే ముందుగా మోడలింగ్ చేసి, ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టింది ఈ పంజాబీ ముద్దుగుమ్మకు స్టార్ డం ఇచ్చిందే తెలుగు సినిమా ఇండస్ట్రీ. కెరీర్ మొదట్లో ఆమె బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. దీంతో “వెంకటాద్రి ఎక్స్ప్రెస్” మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన జతకట్టి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దాదాపు దశాబ్దంపైగానే రాణించింది ఈ అమ్మడు. ఇలా ఆదరించి, స్టార్ స్టేటస్ ఇచ్చిన టాలీవుడ్ హీరోలను తన పెళ్ళికి ఆహ్వానించకుండా పూర్తిగా పక్కన పెట్టేయడంతో రకుల్ తీరుపై మండిపడుతున్నారు తెలుగు ఆడియన్స్. మరి పెళ్లి తర్వాత జరగబోయే రిసెప్షన్ కైనా ఈ అమ్మడు తెలుగు స్టార్స్ ను ఆహ్వానిస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు