Kushitha kallapu: గుంటూరు కారం మూవీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన యంగ్ బ్యూటీ..!

సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో తెలుగమ్మాయి కుషిత కూడా ఒకరు.. సోషల్ మీడియా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా నటించింది.. ఈ మధ్యనే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో కూడా అవకాశాన్ని అందుకున్నట్లు వార్తలు వినిపించాయి. కుషిత కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేస్తూ గుంటూరు కారం సెట్స్ అంటూ ఫోటోలు కూడా షేర్ చేసింది.

దీంతో ఈ ముద్దుగుమ్మ కూడా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలైన గుంటూరు కారం సినిమాలో కుషిత కనిపించలేదు. దీంతో తన పోస్ట్ తో అందరిని ఫూల్ చేసిందని అనుకున్నారు. ఈ విషయం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కుషిత అసలు విషయాన్ని బయటపెట్టింది. తాను నటించిన బాబు నెంబర్ వన్ బుల్షిట్ గాయ్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కొన్ని విషయాలను పంచుకుంది.

ఈ కార్యక్రమంలోని కుషిత మాట్లాడుతూ.. గుంటూరు కారం సినిమా గురించి ప్రశ్నించగా.. ఆమె మాట్లాడుతూ..నాతో నాలుగు రోజులపాటు షూటింగ్ చేశారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తన సన్నివేశాలు లేకపోవడంతో ఆశ్చర్యపోయాను.. చిత్ర టీం ని కూడా అడిగాను.. వాళ్ళు చెప్పిందేమిటంటే.. తనతో పాటు యాక్ట్ చేసిన వారందరినీ కూడా తీసేసినట్లుగా తెలియజేశారు.. ఈ విషయం విని మొదట చాలా బాధపడ్డాను.. కానీ సినీ పరిశ్రమలో ఇలా జరగడం సర్వసాధారణమే అనుకొని రిలాక్స్ అయ్యానని తెలిపింది.

- Advertisement -

ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. ఇదే ఈవెంట్లో బేబీ సినిమా నిర్మాత SKN మాట్లాడుతూ.. కుషితాని ఒక ఏడాది పాటు ఏ సినిమాను చేయవద్దని చెప్పానని.. వైష్ణవి లాగా తనని కూడా హీరోయిన్గా ఇంట్రడక్షన్ చేస్తానని చెప్పినప్పటికీ ఆమె మాత్రం ఇలాంటి సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకుంది.. ఆమె నిర్ణయం పట్ల పట్టుదలను చూసి ఆల్ ది బెస్ట్ చెప్పాను అంటూ తెలిపారు SKN. మొత్తానికైతే గుంటూరు కారం సినిమాలో తన సన్నివేశాలను తీసేసారని తెలిసి బాధపడినట్లు తెలుస్తోంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు