Lifestyle: డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఎందుకు ఏడుస్తారో తెలుసా?

ఎమోషన్స్ అనేవి అందరి జీవితాల్లోనూ ఉంటాయి. కోపమైనా, బాధ అయినా, ఆనందం అయినా ఎమోషన్ ఏదైనా మనిషి జీవితంలో అవి కూడా ఒక భాగమే. అయితే చాలామంది కోపం వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఏదైనా బాధగా ఉంటే ఏడవడం మామూలే. కానీ కోపం వచ్చినప్పుడు ఎందుకు ఏడుపు వస్తుంది? అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఇక డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఏడుపు రావడం తప్పనిసరి. అలాగే సంతోషంగా ఉన్నా సరే సంతోష భాష్పాల రూపంలో కన్నీళ్లు ఉబికి వస్తుంటాయి. సంతోషం అనేది మంచిదే కానీ కోపం, డిప్రెషన్ లు మాత్రం ఆరోగ్యానికి మంచిది కావు. మరి అలాంటి సమయాల్లో ఏడుపు ఎందుకు వస్తుంది అంటే…

కోపం అనేది మన ఎమోషన్స్ లో ఒక భాగం. ఇక ఏడుపు అనేది చాలా సాధారణ ప్రతిస్పందన. అది మన ఫీలింగ్స్ పై ఆధారపడి ఉంటుంది. కొంతమంది కోపం వచ్చినప్పుడు వస్తువులను పగలగొట్టడం వంటి పనులను చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తమ కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. మరి కోపంగా ఉన్నప్పుడు ఏం చేయాలో సంగతి ఏంటి అంటే ఏడుపు అనేది స్వీయ ఓదార్పు లాంటిది. ఆ కోపాన్ని బయటకు వెళ్ళగక్క లేనప్పుడు, నిరాశ, ఆందోళనలు ఎక్కువైనప్పుడు ఏడుపు దానంతట అదే తన్నుకు వచ్చేస్తుంది. ఒకవేళ మీరు గనక మీ కోపాన్ని బయటకు చూపించేస్తే ఆ తర్వాత ఉపశమనం లభించి దాన్ని మర్చిపోతాం. ఒకవేళ కోపాన్ని బయటకు చూపించలేక ఏడ్చేసినా సరే ఆ తర్వాత పూర్తిగా కోపం తగ్గిపోతుంది. కోపం వల్ల వచ్చే ఏడుపు ఒక సాధారణ ప్రతి చర్య. ఎందుకంటే మిమ్మల్ని బాధించే పరిస్థితుల వల్లనే కోపం వస్తుంది.

మరి ఇలా కోపం వచ్చినప్పుడు వచ్చే ఏడుపును ఆపుకోవడం ఎలా? అంటే… గట్టిగా శ్వాస తీసుకోండి. దానివల్ల ఒత్తిడి తగ్గి మీ ఎమోషన్స్ కంట్రోల్ లో ఉంటాయి. చల్లటి నీళ్లు త్రాగండి. కొన్ని క్షణాలు ఆరు బయట గడపండి. టాపిక్ మార్చేయండి. ఇప్పటికీ ఆ టాపిక్ ను పక్కనపెట్టి కొంత సమయం తర్వాత మీ కోపానికి లేదా డిప్రెషన్ గల కారణం ఏంటి అనే విషయాన్ని ఒకసారి ఆలోచించండి. ఇక మీరు కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు, నీకు బాగా ఇష్టమైన వాళ్ళ దగ్గర ఏడవాలనుకున్నంతగా ఏడ్చేయండి. లేదంటే ఆ ఎమోషన్ అలాగే ఉండిపోయి డిప్రెషన్ గా మారే ప్రమాదం ఉంటుంది. పబ్లిక్ లో ఉన్నప్పుడు మీ ఏడుపును కంట్రోల్ చేసుకోండి. లేదంటే అది అపార్థాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. మీకు కోపం రావడానికి గల కారణం ఏంటో మీ స్నేహితులకు చెప్పేయండి. అప్పుడు కోపం అనేది అదుపు దాటకుండా హద్దుల్లో ఉంటుంది. ఇక కోపం వల్ల రక్త పోటు, హై హార్ట్ బీట్ వంటి మానసిక, శారీరక మార్పులు జరుగుతాయి. కాబట్టి వీలైనంతవరకు కోపంగా ఉండకుండా ఉండడానికి ప్రయత్నించండి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు