Sleeping : అలసిపోయినా నిద్ర పట్టట్లేదా? ఇవే రీజన్స్

ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో సరిగ్గా నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం. ఒక మనిషి కనీసం 8 గంటల పాటు హాయిగా నిద్రపోతేనే ఆరోగ్యంగా, ఎనర్జిటిక్ గా ఉంటారు. ఇక రోజంతా పని చేశాక అలసిపోవడం, ఆ అలసట కారణంగా నిద్ర రావడం సాధారణ విషయమే. ఎందుకంటే బాగా అలసిపోయినప్పుడు శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. ఆ సమయంలో పడుకుంటే మెదడుతో పాటు శరీర భాగాలన్నిటికీ కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. ఆ తర్వాత తిరిగి శక్తిని పుంజుకుంటుంది శరీరం. నిద్ర కూడా ఒక వరం లాంటిదే. ప్రస్తుతం మనం గడుపుతున్న ఈ గజిబిజి లైఫ్ లో నిద్ర కూడా సమస్యగానే మారుతుంది. కొంతమందికి పడుకుందాం అనుకున్నా కూడా నిద్ర పట్టదు. మరి మీకు కూడా ఎంత అలసిపోయినా నిద్ర పట్టట్లేదా? ఇలాంటి నిద్ర పట్టకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నిద్ర పట్టకపోవడానికి ఒత్తిడి ముఖ్యమైన కారణం. ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. కానీ నిజానికి ఈ హార్మోన్ పని ఉదయాన్నే నిద్ర లేపడం, మనల్ని అప్రమత్తంగా ఉంచడం, రోజంతా ఎనర్జిటిక్ గా ఉండడానికి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడం. కానీ ఒత్తిడి కారణంగా ఈ హార్మోన్ ఎక్కువ డోస్ లో విడుదలవడంతో మన శరీరం, మైండ్ ఏదో ప్రమాదం ఉందని భావించి దాని నుంచి మనల్ని కాపాడడానికి అప్రమత్తమవుతుంది. ఈ క్రమంలో నిద్ర పారిపోతుంది. కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకండి.

2. ఇక డిప్రెషన్, ఆందోళన, ఇతర మానసిక సమస్యలు కూడా నిద్ర పట్టకుండా చేస్తాయి. వీటి వల్ల కూడా ఒత్తిడి పెరిగి కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా పెరుగుతుంది. దీంతో మీకు నిద్ర కరవవుతుంది. కాబట్టి ఎలాంటి మానసిక సమస్యలు ఉన్న వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. అలాగే డిప్రెషన్ లో ఉన్న టైంలో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి ఎక్కువ సమయాన్ని గడపండి. అప్పుడు డిప్రెషన్ తగ్గిపోతుంది.

- Advertisement -

3. ఇక సాయంత్రం పూట టీవీ లేదా ఫోన్ వంటి వాటిని ఎక్కువగా చూడడం, ఆ స్క్రీన్స్ విడుదల చేసే ఆ బ్లూ రేస్ కారణంగా, కెఫిన్, షుగర్ వంటి చురుకుదనం పెంచే ఆహార పదార్థాలను పడుకునే ముందు తీసుకోవడం, పగటిపూట ఎక్కువగా పని చేయకపోవడం వంటి కారణాల వల్ల కూడా నిద్ర పట్టదు. రోజు మొత్తంలో మీపై పడే ఉష్ణోగ్రత కూడా మీ నిద్రపై ప్రభావం చూపుతుంది. ఉదయం లేదా మధ్యాహ్నం రెండు గంటలు ఎండలో గడపడానికి ప్రయత్నించండి. భోజన సమయంలో బయట కాసేపు విరామం తీసుకోండి. ఇక సాయంత్రం ఇంట్లో ఉన్నప్పుడు లైట్లు ఆఫ్ చేయండి. ఒకవేళ రాత్రిపూట ఫోన్, టీవీ వంటివి కచ్చితంగా చూడాల్సి వస్తే బ్రైట్నెస్ తగ్గించుకుని, సౌండ్ వాల్యూమ్ తగ్గించి చూడండి. పడుకునే గంట ముందు నుంచి అన్నింటినీ పక్కన పెట్టేయండి. ఇక పడుకునే 30 నిమిషాల ముందు వేడినీటి స్నానం చేయడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది.

4. ఇక పీరియడ్స్ వచ్చే వారికి నిద్ర సమస్య ఉందంటే ఆ సమయంలో వారి శరీరంలో ఉండే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్లలో జరిగే మార్పులే కారణం. ఇక ప్రెగ్నెన్సీ వల్ల కూడా హార్మోలలో వచ్చే మార్పులు మీ నిద్రకు భంగం కలిగించవచ్చు.

5. ఇక నిద్ర సరిగా పట్టకపోవడానికి మరొక కారణం షిఫ్టులలో పని చేయడం. సాధారణంగా మనం రోజంతా పని చేస్తూ రాత్రంతా పడుకుని శరీరానికి రెస్ట్ ఇస్తాము. కానీ షిఫ్ట్ ల కారణంగా కొన్నిసార్లు ఉదయాన్నే లేవాల్సి వస్తే, మరి కొన్నిసార్లు రాత్రంతా పని చేయాల్సి ఉంటుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు