Bramhanandam: నవ్వుల రారాజు లిఖించిన ‘నేను’.. ఆవిష్కరించిన “చిరు”..!

తెలుగు వెండితెర హాస్య బ్రహ్మ ‘బ్రహ్మానందం’ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ ని ఏకచక్రాదిపత్యంతో ఏలుతూ ఇప్పటికి జనాల్ని అలరిస్తున్న ఈ హాస్య నటుడు కేవలం నటుడిగానే కాకుండా, సినీ ఇండస్ట్రీలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. సోషల్ మీడియా పుణ్యమా అని కేవలం తెలుగు తెరకే కాకుండా ఇండియా అంతటా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బ్రహ్మానందం ఇప్పటికి తన హాస్యతో ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టిస్తూనే ఉన్నాడు.

ఇక బ్రహ్మానందం నటుడు కాకముందే ఒక లెక్చరర్ అన్న సంగతి తెలిసిందే. అంత కన్నా ముందు నుండే ఒక ఆర్ట్ డిజైనర్ కూడా. ఇలా పలు రంగాల్లో మల్టీ టాలెంటెడ్ గా నిలిచిన బ్రహ్మానందం సినీ ఇండస్ట్రీకి వచ్చిన 40 ఏళ్ళ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆయన స్వయంగా తన జీవితంలో ఎదురైన ఒక పుస్తకం రాయడం జరిగింది.

ఈ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసారు. ఇక బ్రహ్మానందం ఈ పుస్తకం గురించి తెలుపుతూ ‘ఒకరి అనుభవం,మరొకరికి పాఠ్యాంశం అవ్వొచ్చు ,మార్గదర్శకము అవ్వొచ్చు’. ఆ ఒక్కరు మీరు కావచ్చు’ మీలో ఒకరైనా కావొచ్చు’.. అందుకే నన్ను నేను పుస్తకంగా మలచుకున్నాను’ అని పుస్తకంపై తెలపడం జరిగింది. ఇక చిరు ఈ పుస్తకం పై ప్రస్తావిస్తూ సోషల్ మీడియా లో ఇలా ట్వీట్ చేయడం జరిగింది.

- Advertisement -

మనకు అత్యంత ఆప్తుడు అయిన బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు, తెలుసుకున్న విషయాలు,దృష్టికోణాలు, తనకెదురైన
ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా ‘నేను’ అనే పుస్తకరూపంలో అందించడం ఎంతో ఆనందదాయకం. ఈ పుస్తకం చదివే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ, ఈ పుస్తకాన్ని రాసిన బ్రహ్మానందంకి మనస్పూర్తి గా శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ పుస్తక ప్రచురణ కర్తలయిన ‘అన్వీక్షికి’ వారిని అభినందిస్తున్నాను అని తెలియ చేయడం జరిగింది.

ఇక బ్రహ్మానందం రాసిన ఈ పుస్తకం అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో ఆన్లైన్ లో అందుబాటులో ఉంది. 275 రూపాయలు చెల్లించి ఆడియన్స్ ఈ పుస్తకాన్ని దక్కించుకోవచ్చు.

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు