Box office: ఏజెంట్ డే 2 కలెక్షన్స్. డబ్బింగ్ సినిమా కన్నా దారుణం

అక్కినేని అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన మూవీ ఏజెంట్. అఖిల్ హీరోగా వస్తున్న ఏజెంట్ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ముఖ్యపాత్రలో నటించగా ముంబై కి చెందిన బ్యూటీ సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, ‘సురేందర్ 2 సినిమా’ బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించడం జరిగింది.

ఎప్రిల్ 28 న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి ప్లాప్ టాక్ ని మూటగట్టుకుంది. ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో ఏజెంట్ సినిమాకు దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు పది కోట్లయినా వసూలు చేయాల్సిన ఈ చిత్రం కేవలం 4. 95 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. అఖిల్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 36 కోట్లకి పైగా బిజినెస్ చేసింది. కానీ ప్లాప్ టాక్ రావడం తో అక్కడే సినిమాపై మేకర్స్ ఆశలు వదిలేసుకున్నారు. అయితే కనీసం వీకెండ్ లో అయినా కలెక్షన్లు వసూలు చేస్తుందనుకుంటే అది కూడా విఫలమై దారుణమైన కలెక్షన్లు వచ్చాయి.

రెండో రోజు ఏజెంట్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం 67 లక్షలు మాత్రమే వసూలు చేయగా, వరల్డ్ వైడ్ గా 81 లక్షల షేర్ వసూలు చేసింది. రెండో రోజు కనీసం కోటి రూపాయలు కూడా వసూలు చేయని ఈ చిత్రం ఎపిక్ డిసాస్టర్ గా నిలవబోతుంది. అయితే ఏజెంట్ తో పాటే విడుదలైన డబ్బింగ్ చిత్రం PS 2 రెండో రోజు దీనికన్నా ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసింది. దీన్ని బట్టి పబ్లిక్ ఈ సినిమా ని ఎంతలా రిజెక్ట్ చేసారో తెలుస్తుంది. ఆఖరికి గతవారం విడుదలైన విరూపాక్ష కూడా ఏజెంట్ కన్నా ఎక్కువ కలెక్షన్లు సాధించింది. ఇకనైనా టాలీవుడ్ రచయితలు, దర్శకులు కొత్త తరహా కథలు రాస్తే మంచిదని ప్రేక్షకులు ఈ విధంగా బదులిచ్చారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు