Vikrant Rona : డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ

ప్రస్తుతం థియేటర్లో విడుదలైన సినిమాలు కేవలం రెండు మూడు నెలల లోపే ఓటీటీ లోకి వచ్చి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈగ సినిమా విలన్, కన్నడ నటుడు కిచ్చా సుదీప్ నటించిన చిత్రం విక్రాంత్ రోణ ఓటీటిలోకి రావడానికి సిద్ధమైంది. రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం గత నెలాఖరులో పాన్ ఇండియా స్థాయిలో విడుదలయి మంచి హిట్ కొట్టింది. ఈ చిత్రం రూ. 150 కోట్ల వరకు వసూళ్లు చూసి, నిర్మాతలకు రూ. 50 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది.

తాజాగా ఈ విక్రాంత్ రోణ చిత్రం ఓటీటీ విడుదలకు రెడీ అయింది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫాం జీ5 లో ఈ చిత్రం సెప్టెంబర్ 2వ తేదీ నుండి ప్రసారం కానుంది. దీన్ని జీ5 ఓటీటీ సంస్థ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. అలాగే ఒక వీడియోను కూడా షేర్ చేసింది. కాగా ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కొమరట్టు అనే గ్రామంలో పాడు పడ్డ ఇంట్లో రాక్షసుడు ఉంటాడు అని అక్కడి ప్రజల నమ్మకం. అయితే ఆ పాడు పడ్డ ఇంటి ఆవరణలో ఉన్న బావిలో ఒకరోజు పోలీస్ అధికారి శవం దొరుకుతుంది.

ఈ హత్య కేసు ఛేదించడానికి విక్రాంత్ రోణా ఆ గ్రామానికి వస్తాడు. ఈ క్రమంలోనే అక్కడ అప్పటికే చాలా మంది పిల్లలు హత్యకు గురైనట్లు తెలుసుకుంటాడు. వీళ్లును చంపిది ఎవరు. పిల్లల హత్యలకు పోలీస్ హత్యకు సంబంధం ఉందా. అలాగే ఈ కేసుకు విక్రాంత్ రోణ వ్యక్తిగత జీవితానికి ఉంన్న సంబంధం ఏంటి అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు