Unstoppable : 12 గంటల్లోనే రికార్డ్..

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ‘ఆహా’ లో నంబర్ 1 గా దూసుకెళుతున్న టాక్ షో ”అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే” ఈ సక్సెస్ ఫుల్ షో ప్రస్తుతం రెండవ సీజన్ నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ టాక్ షోకు నందమురి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజా గా ఈ టాక్ షో కి ప్రభాస్ గెస్ట్ గా వచ్చారు. పాన్ ఇండియా స్టార్ రావడంతో ఈ షోపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి.

డార్లింగ్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్న ఈ ఎపిసోడ్ లోని మొదటి భాగం శుక్రవారం విడుదల చేయాలి అని ఆహా టీం నిర్ణయించారు. కానీ అభిమానుల కోరిక మేరకు గురువారం రాత్రి 9:30 గంటలకు ఆహా లో విడుదల చేసారు. ఈ ఎపిసోడ్ వచ్చిన కొద్ది క్షణాల్లోనే చాలా మంది ఒకేసారి యాప్ ని ఓపెన్ చేసి వీడియోని వీక్షించటం వాల్ల యాప్ క్రాష్ అయ్యింది.

ఆహ టీం వెంటనే స్పందించి ఆ ప్రాబ్లెమ్ ని ఫిక్స్ చేసారు. దీని తర్వాత ప్రభాస్ ఎపిసోడ్ వ్యూస్ పరంగా అన్ స్టాపబుల్ అన్నట్టు దూసుకెళ్తుంది. వీడియో రిలీజైన 12 గంటల్లోనే ’50 మిలియన్ మినిట్స్’ కు చేరుకొని రికార్డు సృష్టించింది. ఈ ఎపిసోడ్ కి భారీగా డిమాండ్ ఉండటం వల్ల ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. బాలయ్య-ప్రభాస్ మధ్య జరిగిన సంభాషణ ఆధ్యాంతం ఆసక్తి రేపుతుంది. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి విషయం, కృతి సనన్ తో లవ్ ట్రాక్ రూమర్స్ గురించి బాలయ్య ఎక్కువ ప్రశ్నలు వేశాడు.

- Advertisement -

ఈ ప్రశ్నలకు ప్రభాస్ నుంచి వచ్చిన సమాధానాలు, ఫోన్ కాల్ లో రామ్ చరణ్ చెప్పిన విషయాలు ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. ఇదిలా ఉండగా అభిమానులు అందరూ ఈ ఎపిసోడ్ రెండో భాగం కోసం ఇంతకంటే ఎక్కువ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ ఎపిసోడ్ మన ఊహ కి అందనంతగా రికార్డులు సృష్టిస్తుంది అని అనిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు