OTT : మాట తప్పుతున్నారా ?

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఓటీటీలపై ఎంత రగడ జరుగుతుందో అందిరికీ తెలుసు. థియేటర్ లలో వచ్చే సినిమాలు నెల తిరగకుండానే ఓటీటీలోకి వస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్ లకు రాకుండా మొహం చాటేస్తున్నారు. ఇలా జరగడం వల్ల సినిమాలు థియేటర్స్ లో ఎక్కువ రోజులు ఆడటం లేదు. నిర్మాతలకు భారీ నష్టాలు వస్తున్నాయి. హీరోలు మాత్రం సినిమా ఫలితంతో సంబంధం లేకుండా పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ లను పుచ్చుకుంటున్నారు.

దీన్ని కంట్రోల్ చేయడానికి ఇటీవల నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెద్ద సినిమాలు కనీసం 10 వారాల తర్వాత, చిన్న సినిమాలు నాలుగు వారాల ఓటీటీలోకి రావాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఓటీటీకి సంబంధించిన సమస్యలకు పరిష్కారం లభించిందని నిర్మాతలు భావించారు. అనంతరం హీరోల రెమ్యూనరేషన్ విషయంపై ఫోకస్ పెట్టారు. అందులో భాగం నేటి నుంచి షూటింగ్స్ ను బంద్ పెట్టారు.

ఇదిలా ఉండగా, నిర్మాతలు ఓటీటీ విషయంలో తీసుకున్న నిర్ణయాలు బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది. ఎలా అంటే, రామ్ పోతినేని హీరోగా వచ్చిన ది వారియర్ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ ముందు నిరాశ పర్చింది. ఇది ఈ నెల 11న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విడుదల అవుతుందని టాక్. దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఈ డేట్స్ ను మేకర్స్, హాట్ స్టార్ ఫిక్స్ చేశారని సమాచారం. ది వారియర్ అప్పుడు ఓటీటీకి రావడానికి చిన్న సినిమా కాదు. అలా అని పెద్ద సినిమా కూడా కాదు. కానీ, ఈ సినిమా మరీ నాలుగు వారాల్లో ఓటీటీకి వస్తుందని ఎవరూ ఊహించలేదు.

- Advertisement -

అలాగే గోపీ చంద్ హీరోగా వచ్చిన పక్కా కమర్షియల్ సినిమా జూలై1 విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపర్చింది. ఇదిలా ఉండగా, ఈ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్ ఫాంలో ఈ నెల 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమా కూడా పెద్ద సినిమా అని చెప్పలేం. కానీ ఖచ్చితంగా చిన్న సినిమా మాత్రం కాదు. అలాగే ఈ సినిమాను ఓటీటీలో 50 రోజుల తర్వాత తీసుకువస్తామని నిర్మాత బన్నీ వాసు ముందుగా చెప్పాడు. కానీ, ఇప్పుడు ఐదు వారాలకే సినిమాను ఓటీటీకి ఇచ్చేస్తున్నాడు.

దీంతో ఓటీటీలపై నిర్మాతలు అందరు కలిసి తీసుకున్న నిర్ణయం మెల్లిగా తప్పుదారి పడుతున్నట్టు అర్థమవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు