Happy Birthday : ఓటీటీలోకి లావణ్య త్రిపాఠి

“మత్తు వదలరా” సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన రెండవ చిత్రం “హ్యాపీ బర్త్ డే”. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో ఓ కొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ యుర్నేని, రవిశంకర్ ఎలమంచిలి సమర్పణలో చిరంజీవి, హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ చిత్రం జులై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, నరేష్ అగస్త్య, గెటప్ శ్రీను, రాహుల్ రామకృష్ణ, సత్య ఈ సినిమాలో ముఖ్యపాత్రలలో నటించారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించగా సినిమాటోగ్రఫీ సురేష్ సారంగం, శంకర్ ఉయ్యాల ఫైట్స్ కంపోజ్ చేశారు.

చిత్రంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రిత్విక్ సోది (వెన్నెల కిషోర్) పార్లమెంటులో గన్ లా ను పాస్ చేస్తాడు. దేశంలో ఎక్కడ పడితే అక్కడ ప్రజలు గన్ కొనుక్కునేలా చేస్తాడు. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి ఎలాంటి అవినీతికి పాల్పడ్డాడు. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి కి, రక్షణ మంత్రికి ఉన్న సంబంధం ఏమిటనేది సినిమా కథ. అయితే ప్రస్తుతం “హ్యాపీ బర్త్ డే” సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. జులై 8న థియేటర్లలో విడుదలై సందడి చేసిన ఈ చిత్రం ఆగస్టు 8 నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ “నెట్ ఫ్లిక్స్” లో స్ట్రీమింగ్ కానుంది. జాతి రత్నాలు సినిమా స్టైల్ లో ప్రతి పాత్ర ద్వారా వీలైనంత నవ్వించే ప్రయత్నం చేశాడు దర్శకుడు రితేష్ రానా. ఈ చిత్రాన్ని ఆగస్టు 8 నుంచి మీరు కూడా ఓటీటి లో చూసి ఎంజాయ్ చేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు