ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. ప్రేక్షకులు కూడా ఓటీటీకి ఇచ్చే ప్రాధాన్యత ఎక్కువైంది. సినిమా థియేటర్ లో వుండగానే ఓటీటీ ప్లాట్ ఫాంలోకి వచ్చేస్తుంది. కే.జి.ఎఫ్, సర్కారు వారి పాట లాంటి పెద్ద సినిమాల విషయంలో ఇదే జరిగింది. దాంతో జనాలకి థియేటర్ కు వెళ్ళాలనే కోరిక బాగా తగ్గింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే, సర్కారు వారి పాట చిత్రం ఓటీటీ ఎంట్రీ గురించి ప్రకటన ఇవ్వగానే, ఎఫ్3 యూనిట్ హుటాహుటిన ఒక ప్రకటన ఇచ్చింది. 8 వారాల వరకు తమ సినిమాకు ఓటీటీలోకి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అయితే మేజర్, విక్రమ్, అంటే సుందరానికీ వంటి చిత్రాలు రిలీజ్ అవ్వడంతో ఎఫ్3 కలెక్షన్లుపై ప్రభావం పడింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ రావాలంటే, ఇంకా వసుళ్లు బాగానే రావాలి. ఇప్పటి పరిస్థితి చూస్తే అది అసాధ్యం అని తేలిపోయింది. కాబట్టి దిల్ రాజు అమెజాన్ ప్రైమ్ వీడియోతో డీల్ సెట్ చేస్తున్నారని ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. డబ్బులు కాస్త ఎక్కువ వస్తే, ఓటీటీకి ఇవ్వడానికి దిల్ రాజ్ రెడీగా ఉన్నారని సమాచారం. అలా చేస్తే వచ్చే డబ్బుతో ఈ నష్టాలను తీర్చేయొచ్చు అనేది దిల్ రాజ్ అభిప్రాయం. ప్రైమ్ వీడియ త్వరగానే పేమెంట్ చేస్తారు అనే టాక్ కూడా ఎప్పటి నుండో ఉంది. వకీల్ సాబ్ విషయంలో కూడా దిల్ రాజు ఇదే చేశారు.