యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఈ ఏడాది రాధే శ్యామ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. పైగా ఇది ప్రభాస్ ఇమేజ్ కు తగ్గ మూవీ కాదు అని అభిమానులు సైతం పెదవి విరిచారు. అలాగే ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ మూవీ కూడా ప్రభాస్ ఇమేజ్ కు తగ్గ మూవీ కాదు. ఇందులో మైథాలజీ ఇమిడి ఉంది. ప్రభాస్ మార్క్ హీరోయిజం ఇందులో కూడా కనిపించదు. కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి సలార్ పై పడింది. కే.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మూవీ ఇది.
సలార్, కచ్చితంగా ప్రభాస్ అభిమానుల ఆకలి తీర్చే మూవీ అవుతుంది అని అంతా అనుకుంటున్నారు. సలార్ చిత్రం రెండు పార్ట్ లుగా తెరకెక్కుతున్నట్టు ఎప్పటి నుండో టాక్ నడుస్తుంది. అది నిజమా కాదా అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ, ఈ మూవీలో ప్రభాస్ డబుల్ రోల్ చేస్తున్నట్టు వినికిడి. అందుకోసమే ఎన్నో వర్కౌట్ లు చేసి స్లిమ్ లుక్ లోకి మారాడు ప్రభాస్. ఓ పాత్రలో ప్రభాస్ భారీ కాయంతో కనిపించాల్సి ఉందట. స్లిమ్ అయినందుకే ప్రభాస్ అభిమానులు ఇంత హ్యాపీ ఫీల్ అవుతుంటే, డబుల్ రోల్ అనే మాట నిజం అనే అధికారిక ప్రకటన వేస్తే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారో