Virata Parvam : రానా హిట్టు కొట్టినట్టేనా ?

దగ్గుబాటి రానా ఫుల్ లెంగ్త్ హీరోగా నటించిన సినిమాలు రేర్ గా వస్తుంటాయి. ఎక్కువగా మల్టీస్టారర్స్ తో, పరభాషా చిత్రాలతోనే దర్శనమిస్తూ వుంటాడు రానా. అరణ్య ని తీసుకుంటే అది బైలింగ్యువల్ మూవీగా రూపొందింది. అందులో విష్ణు విశాల్ అనే మరో హీరో కూడా ఉంటాడు. ఇక భీమ్లా నాయక్ లో పవన్ డామినేషన్ ఎక్కువే ! నేనే రాజు నేనే మంత్రి తర్వాత రానా ఫుల్ లెంగ్త్ హీరోగా చేసిన సినిమా విరాట పర్వం అనే చెప్పాలి. ఈ రోజు ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ సినిమా, గురు వారం స్పెషల్ షో వేశారు.

ఈ షో నుండే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్న గా అలాగే డాక్టర్ రవిగా రెండు షేడ్స్ కలిగిన పాత్రలో రానా నటించాడు. ఈ పాత్రలో రానాని తప్ప ఎవ్వరినీ ఊహించుకోలేము అన్నంత చక్కగా నటించాడు. సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటించింది. ఈమె పాత్ర గురించి ఎక్కువగా మాట్లాడుకుంటే స్పాయిలర్ అవుతుంది. పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది కాబట్టి, ఈ సినిమా హిట్ అయినట్టేనా అంటే, అది కచ్చితంగా అవునని చెప్పలేము. బాక్సాఫీస్ రిజల్ట్ కూడా కీలకం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలి అంటే, 15 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల కోసమే జనాలు థియేటర్ కు వెళ్ళడం లేదు. అలాంటిది విరాటపర్వం కోసం వెళ్తారా? అందులోనూ ఇది నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీ. ఇలాంటి సినిమాలు క్రిటిక్స్ ను మెప్పిస్తాయి కానీ, జనాలను థియేటర్ కి రప్పిస్తాయి అన్న గ్యారెంటీ ఉండదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు