OTT : దీపావళి ఫైట్

సాధారణంగా దీపావళికి థియేటర్స్ లలో హీరోల మధ్య, హీరోల అభిమానుల మధ్య బిగ్ ఫైట్ ఉంటుంది. ప్రతి ఏటా స్టార్ హీరోల నుంచి చిన్న స్థాయి హీరోల వరకు తమ సినిమాలను దీపావళి బరిలో ఉంచాలని చూస్తారు. రిలీజ్ చేస్తారు కూడా. అయితే ఈ సారి సినిమాల ఫైట్ థియేటర్స్ లోనే కాదు.. ఓటీటీల్లోనూ కనిపిస్తుంది. ఇప్పటికే థియేటర్ లలో విడుదలై, సూపర్ హిట్ అయిన సినిమాలు ఈ దీపావళికి ఓటీటీల్లోకి రాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వనంద్, రీతు వర్మ జంటగా వచ్చిన సినిమా “ఓకే ఒక జీవితం”. ఈ సినిమాకు శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించగా, అక్కినేని అమల కీలక పాత్రను పోషించింది. సెప్టెంబర్ 9న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. సైన్స్ ఫిక్సన్ డ్రామాకు రివ్యూలు కూడా పాజిటివ్ గానే వచ్చాయి. కాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది సినీ ప్రేమికులు వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు అక్టోబర్ 20న సోనీ లివ్ లో ప్రసారం కానుంది.

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా “బింబిసార”. కొత్త దర్శకుడు మల్లడి వశిష్ట్ తెరకెక్కించాడు. ఆగస్ట్ 5న విడుదలై.. దాదాపు 70 కోట్ల వరకు కలెక్షన్లను తెచ్చిపెట్టింది. పీరియాడికల్ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ఆడియన్స్ ను కూడా ఎంటర్ టైన్ చేసింది. అయితే దీని తర్వాత వచ్చిన సినిమాలు ఓటీటీల్లోకి వచ్చినా.. బింబిసార మాత్రం ఇప్పటి వరకు రాలేదు. దీంతో బింబిసార ఓటీటీ రిలీజ్ పై ప్రేక్షకులకు ఆసక్తి నెలకొంది. ఫైనల్ గా బింబిసార ఓటీటీల్లోకి రావడానికి సిద్ధమయ్యింది. అక్టోబర్ 21న జీ5 లో ప్రసారం కానుంది.

- Advertisement -

యంగ్ హీరో నాగ శౌర్య, షిర్లీ సెటియా హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా “కృష్ణ  వ్రిందా విహారి”. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 23న థియేటర్ లలో విడులైంది. అంటే సుందరానికి సినిమా లైన్ తో వచ్చిన ఈ సినిమా కొంత వరకు థియేటర్ లలో కామెడీని పండించింది. ఈ సినిమా ఈ నెల 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

దీంతో పాటు బాలీవుడ్ సంచలనం “బ్రహ్మస్త్ర” కూడా అక్టోబర్ 23న ఓటీటీల్లోకి వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు