Brahmastra : డిజిటల్ స్ట్రిమింగ్ కు రెడీ

బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతూ చేసిన మొదటి చిత్రం ‘స్వాతిముత్యం’. నూతన దర్శకుడు లక్ష్మణ్ కే.కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. వర్ష బోల్లమ్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 5న విజయదశమి కానుకగా ఈ చిత్రం రిలీజ్ అయింది. మొదటి రోజు ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. మొదటి రెండు రోజులు మల్టీప్లెక్స్ లో ఈ మూవీ బాగానే పెర్ఫార్మ్ చేసింది.

ఇక ఇది ఇలా ఉండ‌గా.. ఈ చిత్రం అప్పుడే ఓటీటీ లో బాట పట్టింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ మూవీ థియేటర్ రిలీజ్ కు నాలుగు వారాలలోపే ఓటీటీ బాట పట్టింది.

అలాగే చాలా గ్యాప్ తర్వాత కింగ్ నాగార్జున నటించిన బాలీవుడ్ మూవీ బ్రహ్మస్త్ర. బిగ్ బి అమితాబ్ బచ్చన్, మౌని రాయ్ కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ యంగ్ అండ్ క్యూట్ కపుల్ ఆలియా భట్, రణబీర్ కపూర్ జంటగా నటించిగా అయాన్ ముఖర్జీ డైరెక్టర్ చేశారు. అయితే దీపావళి కానుకగా అక్టోబర్ 23 నుండి బ్రహ్మాస్త్ర ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి డిస్నీ వారు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ‘బ్రహ్మాస్త్ర’ తర్వాత నాగ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘ది గోస్ట్’ దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు