Naane Varuvean : ఓటీటీ డేట్ ఫిక్స్

కోలీవుడ్ బాహుబలీ రేంజ్ అంచనాలు పెట్టుకున్న పొన్నియిన్ సెల్వన్ 1 కి పోటీగా తమిళ హీరో ధనుష్ నానే వరువేన్ తెలుగులో నేనే వస్తున్నా సినిమాను విడుదల చేశాడు. ఈ సినిమా ఆశించిన ఫలితం దక్కలేదనే చెప్పాలి. సెప్టెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలైంది. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇందుజా ర‌విచంద్ర‌న్ హీరోయిన్‌గా న‌టించింది.

ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన మేర‌కు వ‌సూళ్ల‌ను సాధించ‌లేక‌పోయింద‌నే చెప్పాలి. అందుకు పొన్నియిన్ సెల్వ‌న్ ఓ కార‌ణ‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. త‌మిళంలో కాస్త క‌లెక్ష‌న్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ తెలుగులో అంత‌గా రాలేదు. తెలుగులో నేనే వ‌స్తున్నా సినిమాను గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై విడుద‌ల చేశారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌ను అంత‌గా చేయ‌క‌పోవ‌డంతో తొలిరోజు క‌లెక్ష‌న్లు కూడా తెలుగులో త‌క్కువ‌గానే వ‌చ్చాయి. ఈ మ‌ధ్య కాలంలో ధ‌నుష్ న‌టించిన ఏ సినిమా కూడా ఇలా క‌లెక్ష‌న్లు త‌క్కువ రాలేద‌ని మాట్లాడుకోవ‌డం విశేషం.

ప్ర‌స్తుతం ఈ సినిమా డిజిట‌ల్ ప్రిమియ‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. అక్టోబ‌ర్ 23, 2022ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ప్రైమ్ వీడియో మాత్రం అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. కొమురం పులి నిర్మాత క‌లైపులి ఎస్‌.థాను నిర్మించిన ఈ చిత్రానికి యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించారు. థియేట‌ర్ల‌లో అంత‌గా మెప్పించ‌ని ఈ సినిమా ఓటీటీ మ‌రి మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు