Prabhas : అప్పుడు పవర్ స్టార్‌తో.. ఇప్పుడు రెబ‌ల్ స్టార్‌తో

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి వంటి హిట్ సినిమా త‌రువాత వ‌రుస సినిమాల‌తో పుల్ బిజీగా ఉన్నాడు. బాహుబ‌లి సినిమా త‌రువాత సాహో, రాధేశ్యామ్ లాంటి సినిమాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ అవి ఆశించిన మేర‌కు ఆక‌ట్టుకోలేద‌నే చెప్పాలి. రాధేశ్యామ్ సినిమా త‌రువాత ఆదిపురుష్‌, స‌లార్ సినిమాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత టాలీవుడ్ ద‌ర్శ‌కుడు మారుతితో ఓ సినిమా చేస్తున్నారు ప్ర‌భాస్‌.

ఈ సినిమాకి సంబంధించిన ఫోటోల‌ను ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 23న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల మారుతి ప్ర‌క‌టించారు. తాజాగా ప్ర‌భాస్ ఫోటో షూట్‌లో పాల్గొన్న‌ట్టు స‌మాచారం. చిన్న సినిమాల్లో న‌టించ‌వ‌ద్ద‌ని ప్ర‌భాస్‌కి ప‌లువురు చెప్పార‌ట‌. అయినప్ప‌టికీ అవేమి ప‌ట్టించుకోకుండా ప్ర‌భాస్ మారుతితో సినిమా చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రానికి రాజాడీల‌క్స్ అనే టైటిల్ ఫిక్స్ చేశార‌ని స‌మాచారం.

మారుతి- ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కే సినిమాలో బాలీవుడ్ న‌టుడు బొమ‌న్ ఇరానీ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇందులో ప్ర‌భాస్‌కి తాత‌గా న‌టిస్తున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి తాత పాత్ర చాలా కీల‌కం కానున్న‌ట్టు స‌మాచారం. ఇక ఇది వ‌రకే ప‌వ‌న్ క‌ళ్యాణ్-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన అత్తారింటికి దారేది చిత్రంలో బొమ‌న్ ఇరానీ తాత పాత్ర‌లో అంద‌రినీ మెప్పించిన విష‌యం తెలిసిందే. ప్ర‌భాస్ సినిమాలో తాత‌గా బొమ‌న్ ఇరానీ ఎలా మెప్పిస్తాడో వేచి చూడాలి. ప్ర‌భాస్ ఆదిపురుష్‌, స‌లార్ సినిమాలు పూర్త‌యిన త‌రువాత ఈ సినిమా చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు