Babli Bouncer : ఓటీటీ డేట్ ఫిక్స్

తమన్నా ఈ మధ్య కాలంలో థియేట్రికల్ సినిమాల కంటే, ఓటీటీ సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతుంది. తమన్నా ఇప్పటికే ఓటీటీలో కొన్ని వెబ్ సిరీస్ ల్లో నటించింది. అలాగే నితిన్ హీరోగా వచ్చిన మాస్ట్రో సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అయింది. మాస్ట్రోలో తమన్నా నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇది థియేట్రికల్ రిలజీ కోసం తెరకెక్కించినా, కరోనా మహమ్మారి వల్ల ఓటీటీలోకి వచ్చింది.

తాజా గా తమన్నా మరోసారి ఓటీటీ స్క్రిన్ పై కనిపించబోతుంది. “బాబ్లీ బౌన్సర్” అనే సినిమాలో తమన్నా నటించింది. స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ నిర్మించారు. బాబ్లీ బౌన్సర్ 23 సెప్టెంబర్ 2022న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో హిందీ, తమిళం తో పాటు తెలుగులో విడుదల కానుంది. తమన్నా ఈ సినిమాలో బౌన్సర్ పాత్రలో కనిపించబోతుంది.

దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ లో తమన్నా సరికొత్తగా కనిపిస్తోంది. అలాగే తమన్నా బాడీ లాగ్వేంజ్ కూడా బౌన్సర్ ను పోలినట్టే ఉంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాను మధుర్ భండార్కర్ తెరకెక్కిస్తున్నాడు. స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అలాగే తమన్నా తో పాటు సౌరభ్ శుక్లా, అభిషేక్ బజాజ్ మరియు సాహిల్ వైద్ కీలక పాత్రలలో నటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు