Ayalaan: శివకార్తికేయన్ “అయాలన్” తెలుగు సినిమాలను దెబ్బతీస్తుందా..?

తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం అయాలన్. శివకార్తికేయన్ కి తెలుగులో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల శివకార్తికేయన్ సినిమాలన్నీ తెలుగులో విడుదలై ఇక్కడ కూడా మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ఇప్పుడు అలయాన్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు శివకార్తికేయన్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఆర్.రవికుమార్ కధ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. కేజేఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాటి జయం రాజేష్ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.
100 కోట్ల భారీ బడ్జెట్ తో 2016లో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. 2018 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్న కథ కావడంతో బడ్జెట్ బాగా పెరిగిపోయింది. దీంతో అయాలన్ సినిమా రిలీజ్ ఆలస్యమైంది. దాదాపు 5 ఏళ్ల పాటు నిర్మాణం జరుపుకున్న ఈ మూవీ ఎట్టకేలకు ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కాబోతోంది. అయితే ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలకు ఇప్పటికే 5 తెలుగు సినిమాలు పోటీ పడిన విషయం తెలిసిందే. గుంటూరు కారం, హను-మాన్, సైంధవ్, నా సామి రంగ తో పాటు ఈగల్ చిత్రాలు ఈ సంక్రాంతి సందర్భంగా విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి.
అయితే ఒకేసారి ఇన్ని సినిమాలు వస్తే దేనికి తగినన్ని థియేటర్లు దొరకవని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఆయా నిర్మాతలతో చర్చలు జరిపాయి. దీంతో ఈగల్ సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకుంది. కానీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన శివకార్తికేయన్ అయాలన్ సినిమా ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలిచిన తెలుగు సినిమాలకు తలనొప్పిగా మారింది. ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే నాలుగు తెలుగు సినిమాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ ఈ సినిమా మంచి టాక్ ని గనుక సొంతం చేసుకుంటే సంక్రాంతి బరిలో నిలిచిన తెలుగు సినిమాలకి ఇబ్బందులు తప్పకపోవచ్చు అంటున్నారు సినీ విశ్లేషకులు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు