Guntur Kaaram : ఇంత నెగెటివిటీ… రమణ గాడికి ప్లస్సా మైనాస్సా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం” మూవీ ఎట్టకేలకు అనుకున్నట్టుగానే జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ జోష్ తో నడుస్తున్నాయి. ఒకవైపు మేకర్స్ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసేలా ప్రమోషన్స్ చేస్తుంటే, మరోవైపు ఈ సినిమాపై వస్తున్న నెగెటివిటీ అంతకంటే ఎక్కువగా ఉంది. మరి రమణ గాడికి ఈ నెగెటివిటీ ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా?

జనవరి 12న “గుంటూరు కారం” మూవీతో పాటు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న “హనుమాన్” మూవీ కూడా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ భారీ క్లాష్ కారణంగా మహేష్ బాబు అభిమానులు “హనుమాన్” మూవీపైన, “హనుమాన్” మూవీ టీంపై సానుభూతిని చూపిస్తున్న వారు, అలాగే తేజ, ప్రశాంత్ వర్మ అభిమానులు “గుంటూరు కారం” మూవీపై నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. కావాలని మహేష్ కు ఉన్న స్టార్డం సాకుతో “హనుమాన్” మూవీని తొక్కేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. ముఖ్యంగా “గుంటూరు కారం” మూవీ నిర్మాత నాగ వంశీ, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తీరుపై ఫైర్ అవుతున్నారు.

ఒకే రోజు రిలీజ్ కాబోతున్న ఈ రెండు సినిమాలకు థియేటర్లను కేటాయించే విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారని, “హనుమాన్” మూవీకి థియేటర్లు దక్కకుండా దాదాపుగా అన్ని థియేటర్లను “గుంటూరు కారం” మూవీకే ఇచ్చేసారని దిల్ రాజును ఏకిపారేస్తున్నారు. నిజానికి ఒకే రోజు రెండు సినిమాల మధ్య క్లాష్ వస్తే సమానంగా థియేటర్లను పంచాలనీ, ఆ తర్వాత ఏ మూవీకి నెగెటివిటీ వస్తే ఆ మూవీకి థియేటర్లను తగ్గించి, పాజిటివ్ టాక్ ఉన్న సినిమాకు థియేటర్లను పెంచితే సరిపోతుందని అంటున్నారు.

- Advertisement -

కానీ “గుంటూరు కారం” టీం మాత్రం వాళ్ళ ఇష్టానుసారంగా అన్ని థియేటర్లను ఆక్రమించేశారు. హైదరాబాదులో 96 సింగిల్ స్క్రీన్స్ ఉంటే అందులో 90 థియేటర్లలో “గుంటూరు కారం” మూవీ కోసం లాక్ చేశారు. ఈ విషయంపై కూడా సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఇంత నెగెటివిటీ ఈ మూవీకి ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో తెలియదు గానీ ప్రస్తుతానికి అయితే “గుంటూరు కారం” మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక “గుంటూరు కారం” మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మహేష్ బాబు మొట్టమొదటిసారిగా మాస్ రోల్ పోషిస్తుండడం, శ్రీలీల, మీనాక్షి చౌదరి వంటి కొత్త హీరోయిన్లతో ఆయన రొమాన్స్ స్క్రీన్ పై ఫ్రెష్ గా కనిపించడం, త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో వస్తున్న మూడవ మూవీ కావడంతో ముందు నుంచే ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. అంతేకాకుండా అవకాశం ఉన్నంత మేరకు “గుంటూరు కారం” మూవీని చాలా థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉండడం, తమన్ అందించిన బిజిఎం, మాస్ సాంగ్, ముఖ్యంగా క్లైమాక్స్ 45 నిమిషాలు, మదర్ సెంటిమెంట్, యాక్షన్ బ్లాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. మరి జనవరి 12న రాబోతున్న ఈ మూవీతో మహేష్ బాబు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు