Nikhil : ఫలితం దక్కుతుందా ?

టాలీవుడ్ కు గత రెండు నెలల నుంచి ఒక హిట్ లేదు. జూలై నెలలో భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ ముందు బొక్క బోర్ల పడ్డాయి. థియేటర్ లకు జనాలు ఇక రావడం కష్టమే అనుకునే సమయంలో సీతా రామం, బింబిసార వచ్చాయి. ఆగస్టు నెలకు శుభారంభాన్ని ఇచ్చాయి. ఈ సినిమాలతో థియేటర్లు మరోసారి కళకళలాడుతూ కనిపించాయి. దీంతో నిర్మాతలకు కాస్త ఊపిరి తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు చూస్తే, లాల్ సింగ్ చడ్డాకు మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదంటూ సినీ విశ్లేషకులు డైరెక్ట్ గానే చెప్పారు.

అలాగే ఈ రోజు విడుదలైన మాచర్ల నియోజకవర్గంకు కూడా ప్రస్తుతం నెగిటివ్ టాక్ వినిపస్తుంది. ఇంకా పూర్తి రివ్యూలు రాకపోయినా, పబ్లిక్ టాక్ ప్రకారం.. నితిన్ కెరీర్ లో మరో ప్లాప్ అని తెలుస్తుంది. దీని ప్రభావం రేపు రాబోయే కార్తికేయ2పై పడనుంది అని చెప్పొచ్చు. మాచర్ల నియోజకవర్గం సినిమాకు విడుదల ముందు భారీ అంచనాలు ఉండేవి. కానీ, సినీ ప్రేక్షకులకు మాత్రం పెద్దగా రుచించలేదని చెబుతున్నారు.

మరీ రేపు విడుదలయ్యే కార్తికేయ-2 ఎలా ఉంటుందో అని ఇప్పటి నుంచే టెన్షన్ ప్రారంభమైంది. నిజానికి కార్తికేయ-2 కోసం హీరో నిఖిల్ అండ్ టీం చాలా కష్టపడ్డారు. కొత్త రకం స్టోరీతో రావడం పోస్టర్ల నుంచి ట్రైలర్ వరకు అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీ లెవెల్ లో ఉన్నాయి. అందు కోసమే మంచి సమయం కోసం వెయిట్ చేశారు. మంచి టైం వచ్చినా, ఇతర నిర్మాతలు వాయిదా వేయాలని కోరితే.. ఇండస్ట్రీలో సానుకూల వాతవరణం కోసం అంటూ వాయిదా వేసుకుంటూ వచ్చారు.

- Advertisement -

ఫైనల్ గా మోస్ట్ అవెయిటెడ్ సినిమా శనివారం పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతుంది. మరి హీరో నిఖిల్ అండ్ టీం పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుందా? ఆగస్టు నెల ప్రారంభంలో ఉన్న సెంటిమెంట్ ను మళ్లీ పునరావృతం చేస్తారా ? లేదా లాల్ సింగ్ చడ్డా, మాచర్ల నియోజకవర్గం లాగా బొక్క బోర్ల పడతరా అని తెలియాలంటే, రేపటి వరకు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు