Agent: వైల్డ్ సాలా విత్.. ఊర్వశి రౌటేలా

అక్కినేని అఖిల్ హీరోగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఏజెంట్. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, ‘సురేందర్ 2 సినిమా’ బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిప్-హాప్ తమిజా ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. ఇక ఏజెంట్ లో ముంబై కి చెందిన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమా పై ఉన్న అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసాయి.

తాజాగా ఈ సినిమా కి సంబంధించిన ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ అయింది. కేవలం ఒక నిమిషం నిడివి గల ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా తన డాన్స్ తో మెస్మరైజ్ చేసింది. వైల్డ్ సాలే అంటూ సాగే ఈ పాట హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఉంది. ఇక ఈ పాటలో అఖిల్ చేసే డాన్స్ మరో ఆకర్షణ గా నిలిచింది. ఈ పాటను రఘురాం రాయగా, శ్రావణ భార్గవి, భీమ్స్ సిసిరోలియో పాడారు. ఇక ఈ పాటకి మాత్రం హిప్ హప్ తమిజా కాకుండా భీమ్స్ మ్యూజిక్ ఇచ్చాడు.

అయితే కొన్ని రోజుల కిందట ఊర్వశి నటించిన ఈ పాట కి సంబంధించి ఉమైర్ సందు తప్పుడు ట్వీట్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఊర్వశి ని అఖిల్ డేటింగ్ పేరుతో వేధిస్తున్నాడంటూ ఉమైర్ సంధు ట్విట్టర్ లో ట్వీట్ వేశాడు. దానికి ఊర్వశి రౌటేలా అప్పుడే స్పందించి అలాంటి తప్పుడు కామెంట్లు చేస్తూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినందుకు అతనిపై కోర్టులో కేసు వేసింది. కాగా ఏజెంట్ మూవీని పాన్ ఇండియా లెవెల్లో ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు