Box Office : డిసెంబర్ హీరో ఎవరు ?

కరోనా మహమ్మారితో టాలీవుడ్ చాలా కష్టాలను అనుభవించింది. 2020లో చాలా రోజుల పాటు థియేటర్స్ మూతబడ్డాయి. 2021లో లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయినా, జనాలు సినిమాలకు రావడానికి భయపడ్డారు. 2022లో కరోనా ప్రభావం తగ్గింది. కానీ ప్రేక్షకుల్లో ఓటీటీల ప్రభావం పెరిగింది. ఎంత పెద్ద సినిమా వచ్చినా ఓటీటీల్లోకి వస్తుంది కదా.. అప్పుడు చూద్ధాం లే అనే ఫీలింగ్ తో ఉండేవాళ్లు.

కానీ ఈ ఏడాది మధ్యలో సీతారామం, బింబిసార, కార్తికేయ 2 లాంటి సినిమాలు థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత కంటెంట్ బాగా ఉన్న సినిమాలు థియేటర్స్ లో ఆడుతాయని నమ్మకం కుదిరింది. నవంబర్ లో చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాన్ని నమోదు చేశాయి. నవంబర్ మొదటి వారంలో వచ్చిన అల్లు శిరిష్ ఊర్వశివో రాక్షశివో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే యశోద, మసూద తో పాటు లవ్ టూడ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి.

ఇప్పుడు 2022లో చివరి నెల డిసెంబర్ వచ్చింది. మరి ఈ నెలలో బాక్సాఫీస్ వద్ద ఎవరు హీరోగా నిలుస్తారు అని సినీ లవర్స్ ఆలోచిస్తున్నారు. ఎందకంటే డిసెంబర్ నెలలో బాక్సాఫీస్ హిట్ కొడితే.. తర్వాత వచ్చే ఏడాది కూడా ఆ సినిమా హీరో ప్రభావం ఉంటుంది. కాగా ఈ నెల 2న అడివి శేష్ హిట్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ ఆడియన్స్ లో భారీ స్థాయిలో అంచనాలను పెంచింది. ఈ సినిమా డిసెంబర్ లో గెలిచే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి.

- Advertisement -

దీని తర్వాత చెప్పుకోదగ్గా సినిమాలు డిసెంబర్ 22న వచ్చే లాఠీ, 23న విడుదల కాబోయే 18 పేజీస్, ధమాకా. ఇందులో లాఠీ తెలుగు డబ్బింగ్ సినిమా. విశాల్ కు తెలుగులో కూడా మార్కెట్ ఉంది. కాబట్టి ఈ సినిమా కూడా హిట్ కొట్టవచ్చు. కార్తికేయ2 హిట్ లో ఫుల్ జోష్ లో ఉన్న కాంబో నిఖిల్-అనుపమ. వీరు మళ్లీ 18 పేజీస్ తో ప్రేక్షకుల ముందుకు ఈ నెలలోనే రాబోతున్నారు. అలాగే మాస్ మహారాజ రవితేజ ఇటీవల రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో వచ్చాడు. ఈ సినిమా కెరీర్ లోనే అత్యంత డిజాస్టార్ గా మిగిలింది. దీంతో ధమాకా పై రవితేజతో పాటు ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

డిసెంబర్ లో అన్నింటి కంటే ఎక్కువ అంచనాలు ఉన్న సినిమా అవతార్2. 2009లో వచ్చిన అవతార్ సినిమాకు ఇది సీక్వెల్ గా వస్తుంది. ఇది డిసెంబర్ 16న విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దీనికి తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన రెండు ట్రైలర్లను చూస్తే.. అవతార్ 1 ను బీట్ చేసే సత్తా ఉందని తెలుస్తోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ హీరోగా ఈ హాలీవుడ్ మూవీ నిలుస్తుందా.. లేదా తెలుగు సినిమా నిలుస్తుందా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు