విశ్వక్ సేన్ కీ రోల్ లో నటించిన చిత్రం “ముఖచిత్రం”. ఈ చిత్రానికి గంగాధర్ డైరెక్టర్ కాగా, స్టోరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్ నేషనల్ అవార్డు విన్నర్ ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ అందించారు. కాలభైరవ సంగీతం అందించారు. వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, ఆయేషా ఖాన్, చైతన్య రావు, సునీల్, రవిశంకర్ తదితరులు నటించిన ఈ చిత్రం డిసెంబర్ 9వ తేదీన రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ముఖచిత్రం సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ వివరాల్లోకి వెళితే, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో ముఖచిత్రం కోర్టు డ్రామాగా తెరకెక్కినట్టు ట్రైలర్ లో స్పష్టమైంది. ఈ చిత్రం మెడికల్ ఎలిమెంట్స్ అంటే, ప్లాస్టిక్ సర్జరీ చేసే చిన్న మ్యూజిక్ తో కథ అనేక మలుపులు తిరిగిందనే విషయాన్ని దర్శకుడు గంగాధర్ చెప్పకనే చెప్పాడు. సీనియర్ నటుడు రవిశంకర్, విశ్వక్సేన్ మధ్య కోర్టు సీన్లు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా మారే అవకాశం కనిపించింది.
Read More: Kushi: రొమాంటిక్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రైలర్ లో చూపించిన సన్నివేశాలు, డైలాగ్స్ ఆసక్తిని రేపేలా ఉన్నాయి. ప్లాస్టిక్ సర్జరీ అనేది మెడికల్ రంగంలో ఓ అద్భుతం. అందరికీ అర్థం కానిది, కానీ చాలా ఫేమస్ అంటూ డైలాగ్స్ ఈ కథ ప్రాముఖ్యతను చెప్పాయి. ఇక కోర్టు హాలులో రవిశంకర్, విశ్వక్సేన్ మధ్య వాగ్వాదం టెంపోను క్రియేట్ చేసింది. కాగా ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Read More: Prabhas: రీ- రిలీజ్ రేస్ లో ప్రభాస్ మరో సినిమా
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...
నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ...