SSMB28: శోకం – షూటింగ్

మాములుగా సినిమాలో హీరోకి కష్టాలు వస్తేనే థియేటర్ లో కూర్చున్న మనం చలించిపోతాం. అటువంటిది మనం అభిమానించే హీరోలకి నిజ జీవితంలో కష్టాలు వస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఇటివలే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట వరుస విషాదాలు జరిగాయి.సంవత్సర కాలవ్యవధిలోనే తన అనుకున్న వాళ్ళను కోల్పోవడం మహేష్ కి తీరని లోటు. మహేష్ ప్రస్తుతం తీవ్రమైన శోకంలో ఉండి కూడా మొన్న జరిగిన పెద్ద ఖర్మ లో అభిమానులకు ధైర్యం ఇస్తూ మాట్లాడారు.

మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే ఈ చిత్రం మొదటి షెడ్యూలు కూడా పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ కి సిద్ధమవుతున్న తరుణంలో ఊహించని సంఘటన ఎదురైంది. ఇంతటి విషాదంలో కూడా మహేష్ షూటింగ్ కి సిద్ధమవుతునట్లు తెలుస్తుంది. ముందుగా నిర్మాతలకు మాట ఇచ్చినట్లుగానే డిసెంబర్ 2వ వారంలోనే మహేష్ షూటింగ్ హాజరవనున్నట్లు తెలుస్తోంది. ఇంతటి శోకంలో కూడా తన వృత్తి పట్ల ఉన్న నిబద్ధతను మెచ్చుకోవాల్సిందే.

ఇకపోతే అతడు, ఖలేజా సినిమాలు తరువాత ఈ కాంబినేషన్ మరోసారి జతకట్టడం అభిమానులకి ఆనందం కలిగించే విషయం. ప్రస్తుతం SSMB28 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజ హేగ్దే నటించనుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక – హాసిని క్రియేషన్స్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు