Bollywood Ramayan: ఈ కన్ఫ్యూజన్ ఏంటి మాస్టారూ… అసలు సీత ఎవరు?

ఈ కన్ఫ్యూజన్ ఏంటి? సీత ఏంటి ? అనుకుంటున్నారా… అదేనండి బాలీవుడ్‌లో రామాయణం చేయడానికి చాలా రోజుల నుంచి సన్నాహాలు జరుగుతున్నాయి కదా. దానిలో సీత పాత్ర గురించి. ఆదిపురుష్ సినిమాను, దానికి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్‌ను చూసిన తర్వాత కూడా రామాయణాన్ని ప్రేక్షకులకు చూపించడానికి తహతహలాడుతుంది బాలీవుడ్. అంతే కాదు… దీన్ని రెండు పార్ట్‌లుగా చూపబోతున్నారట.

ఒక వేళ మంచి వీఎఫ్‌ఎక్స్ వర్స్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండ ఆదరిస్తారు. అయితే ఇక్కడ కొన్ని డౌట్స్… కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. రాముడు పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్నాడని ఈ సినిమా గురించి న్యూస్ వచ్చిన ప్రతిసారి వినిపిస్తుంది. అలాగే రావణ్ పాత్రను కేజీఎఫ్ స్టార్ యష్ చేయబోతున్నాడని కూడా ప్రతి సారి చెబుతున్నారు.

అయితే ఇక్కడ క్లారిటీ రావాల్సింది సీత పాత్ర గురించే. ముందుగా సీత పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించామని టాక్ వచ్చింది. అంతే కాదు, సాయి పల్లవినే కన్ఫామ్ అని కూడా చెప్పుకున్నారు. కానీ, సడన్ గా సాయి పల్లవి కాదు.. రణబీర్ కపూర్ సతీమణి ఆలియ భట్ సీత పాత్ర చేయబోతుంది అంటూ మళ్లీ ఓ టాక్ వచ్చింది.

- Advertisement -

తీరా ఇప్పుడు చూస్తే లేదు లేదు.. సీత పాత్ర సాయి పల్లవినే చేస్తుంది అంటూ బీ టౌన్ మీడియా కోడైకూస్తుంది. ఆస్పత్రి నిర్మాణ పనుల వల్ల చాలా రోజుల పాటు కెమెరాకు దూరంగా ఉన్న సాయి పల్లవి ఇటీవలే ఒక సినిమాకు సైన్ చేసింది. ఇప్పుడు రామాయణంలో సీత పాత్ర చేస్తే సాయి పల్లవి సెట్ అవుతుంది. కానీ, ఆమె ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చేస్తుందా అనేదే ప్రశ్న. పోని.. సీత పాత్రను ఆలియ భట్ చేసినా బాగుంటుంది. కానీ, ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేశారు అనేది మాత్రం క్లారిటీ రాలేదు.

ఈ బాలీవుడ్ రామాయణాన్ని డైరెక్ట్ చేయబోతున్న నితేష్ తివారీ ఈ పాత్రల గురించి గానీ, షూటింగ్ గురించి గానీ ఒక్క మాట మాట్లాడటం లేదు. దీంతో ఈ కన్ఫ్యూజన్ మరింత ఎక్కువ అయింది. అయితే, బీ టౌన్ లో ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం.. రాముడుగా రణబీర్.. సీతగా సాయి పల్లవి… రావణ్ గా యష్ కనిపించబోతున్నారు. 2024 స్టార్టింగ్ లో షూటింగ్ ప్రారంభం.

రెండు పార్ట్స్ కాబట్టి.. ఫస్ట్ పార్ట్ లో యష్ పాత్ర చాలా తక్కువగా ఉంటుందట. అందు కోసం ఆయన కేవలం 15 రోజుల టైం మాత్రమే ఇస్తున్నాడని టాక్. సెకండ్ పార్ట్ వచ్చే లోపు యష్ 19 మూవీని పూర్తి చేస్తాడని సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు