ప్రశంసలు తో విమర్శలు కూడా పక్కపక్కనే ప్రయాణిస్తాయి.
సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ అదిరిపోయింది అని మహేష్ అభిమానులు ఒక వైపు మంచి ఊపులో ఉన్నారు, కొందరికి ఒక డైలాగ్ చిన్నపాటి అసంతృప్తిని మిగిల్చింది అని చెప్పొచ్చు.
మహేష్ కీర్తి సురేష్ తో “నేను విన్నాను నేను ఉన్నాను” అని చెప్పే డైలాగ్ గురించి పరశురామ్ పలు ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇస్తూ వచ్చారు.
ఒక ప్రముఖ ఛానెల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తను దివంగత నేత వై యస్ రాజశేఖర్ రెడ్డికి పెద్ద అభిమానిని అని, తను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లో వర్క్ చేస్తున్న టైంలో, వై యస్ “నేను విన్నాను – నేను ఉన్నాను” అని ప్రజలకు ఇచ్చిన భరోసా లో లోతైన అర్ధం ఉందని, అది ఈ సినిమాలో సందర్భానికి సరిపోతుందని వాడాను అని చెప్పుకొచ్చారు పరశురామ్.
కానీ కొందరి వాదన ప్రకారం ఈ మాటలు అసలు వై యస్ అనలేదు అని,
యాత్ర సినిమాలో సీన్ ఎలివేషన్ కోసం ఇది రాసిన డైలాగ్ అని, దీనిని ప్రచారంలో జగన్ వాడుకోవడం వలన ఇది పాపులర్ అయిందని కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా “సర్కారు వారి పాట” సినిమాపై మాత్రం అభిమానులకి మంచి అంచనాలు ఉన్నాయ్.