ఎంత చిత్రం ఎన్నేసి జ్ఞాపకాలో

వివేక్ సాగర్ , ఈ పేరు తెలియని సంగీత ప్రేమికులు ఉండరు,
రిఫ్రెషింగ్ మ్యూజిక్ ఇవ్వడంలో తనదొక ప్రత్యేకమైన శైలి
ఆయన కంపోజ్ చేసిన పాటలు వింటే చాలు హాయిగా వేరే ఊహ ప్రపంచలోకి ప్రయాణం చెయ్యొచ్చు. రేస్ సినిమాతో సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన వివేక్. పెళ్లి చూపులు , ఈ నగరానికి ఏమైంది, సమ్మోహనం , బ్రోచేవారెవరు సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు.

వివేక్ సాగర్ ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా చేస్తున్న ” అంటే సుందరానికి” సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారు.
ఇదివరకే వివేక్ ఆత్రేయ చేసిన బ్రోచేవారెవరు సినిమాకి మంచి మ్యూజిక్ అందించాడు సాగర్. ఇప్పుడు అదే మ్యాజిక్ ను రిపీట్ చేసాడు ఈ సినిమా నుంచి రిలీజైన ” ఎంత చిత్రం” పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈ పాటలో నాని, నజ్రియా మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది అనిపిస్తుంది , రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయ్. అనురాగ్ కులకర్ణి , కీర్తన పాడిన ఈ సాంగ్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. ఈ పాటలో కనిపించే కేరళ విజువల్స్ ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు