సామ్-చై.. మధ్యలో మెగా స్టార్..?

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్స్ గా ఉన్న సమంత – నాగ చైతన్య వ్యక్తిగత కారణాలతో డైవర్స్ తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల తర్వాత.. ఇద్దరు కూడా పర్సనల్ లైఫ్ కు దూరంగా.. సినీ లైఫ్ కు దగ్గరగా ఉంటున్నారు. పోటీ పడినట్లే సినిమాలు కూడా చేస్తున్నారు. తాజా గా ఈ మాజీ దంపతులు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటానికి సిద్ధం అవుతున్నారు. 

పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ పెట్టిన స‌మంత‌.. లేటెస్ట్ గా హరి శంకర్ – హరీష్ నారాయణ్ డైరెక్ష‌న్ లో య‌శోద సినిమాను చేస్తుంది. ఈ సినిమా ఆగస్ట్ 12న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. అలాగే నాగ చైతన్య టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ.. బీ టౌన్ వైపు కూడా అడుగులు వేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా మూవీ చేశాడు. 

ఈ మూవీ కూడా పాన్ ఇండియా లేవెల్ లోనే ఆగస్ట్ 11న విడుదల కాబోతుంది. ఇలా.. ఈ మాజీ దంపతులు బాక్సాఫీస్ బరిలో నిలవబోతున్నారు. అయితే వీరి మధ్య మెగా స్టార్ చిరంజీవి కూడా రాబోతున్నట్టు సమాచారం. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. 

- Advertisement -

కాగ ఈ మూవీని ఆగష్టు 12న రిలీజ్ చేయబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. దీంతో మాజీ దంపతుల వార్ మధ్యలో మెగా స్టార్ రాబోతున్నాడు. ఈ వార్ లో చై-సామ్ గెలుస్తారా.. లేదా.. ఇండస్ట్రీ బాస్ గెలుస్తాడా.. చూడాలి మరీ.

అయితే ఆచార్య మూవీతో  చిరంజివీ ఇమేజ్ కొంత్ వరకు డ్యామేజ్ అయింది. దాని నుంచి బయట పడటానికి గాడ్ ఫాదర్ ను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని మెగాస్టార్.. స్వయంగా నిర్ణయం తీసుకున్నాడట. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు