రిలీజ్ లోపైనా.. రివీల్ చేస్తారా..?

ఒక సినిమా అనౌన్స్ చేసే సమయంలోనే.. ఆ సినిమా కాస్ట్ అండ్ క్రూ ప్రకటిస్తారు. అయితే కొన్ని సినిమాలు నటీ నటులను రివీల్ చేయకుండా.. సస్పెన్స్ క్రియేట్ చేస్తారు. కానీ ఆ మూవీ కోసం పని చేసే క్రూ గురించి మాత్రం ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉంటారు. కానీ.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో  రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరో గా వస్తున్న లైగర్ సినిమాకి మాత్రం ఇలా జరగలేదు. 

లైగర్ సినిమాను పూరీ జగన్నాథ్ అనౌన్స్ చేసిన తర్వాత.. క్రమంగా నటీ నటులను ఎంపిక చేస్తూ పోస్టర్స్ తో ప్రేక్షకులకు పరిచయం చేశారు. అలాగే సినిమా కోసం పని చేసే వాళ్ల పేర్లను కూడా ప్రకటించారు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ తో పాటు లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ అయ్యాయి.

అప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ పేరును చెప్పలేదు. లిరికల్ సాంగ్ కు విక్రమ్ మాంట్రోస్ సంగీతం అందించినట్టు టైటిల్స్ లో చెప్పారు. అయితే అన్నీ సాంగ్స్ ఆయనే ఉంటారా.. అంటే సమాధానం లేదు. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ ను టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ అందించినట్టు చెబుతున్నారు. కానీ ఆఫీషియల్ గా లైగర్ మూవీకి సంగీత దర్శకుడు ఎవరని ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. 

- Advertisement -

మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో లైగర్ టీం రెండేళ్ల నుంచి సస్పెన్స్ ను కొనసాగిస్తూనే ఉంది. కాగ ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 25న పాన్ ఇండియా రెంజ్ లో రిలీజ్ కానుంది. రిలీజ్ లోపే అయినా.. మ్యూజిక్ డైరెక్టర్ ను రివీల్ చేస్తారో లేదో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు