సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ పై మహేష్ బాబు స్పందన..!

నిన్న జరిగిన ‘మేజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి బయోపిక్ పై స్పందించారు. ‘మేజర్’ మూవీ ముంబై దాడుల్లో ప్రాణత్యాగం చేసిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి మహేష్ బాబు కూడా ఓ నిర్మాత కాబట్టి.. నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ కు అతను కూడా హాజరయ్యాడు. ఈ సినిమాలో శేష్ హీరోగా నటించాడు. శేష్ బదులు మీరెందుకు ఈ పాత్రలో నటించలేదు అనే ప్రశ్న మహేష్ కు ఎదురైంది. అందుకు మహేష్ ‘కొన్ని సినిమాలు కొందరే చేయాలి. ‘మేజర్‌’లో సందీప్‌ గా శేష్‌ బాగా సూటయ్యాడు. సందీప్‌ పాత్ర నేను చేసుంటే బాగుండేదేమోనని ఆలోచించే అంత సెల్ఫిష్‌ కాదు నేను. నా సినిమాలు నేనే చేయాలి. మిగతా సినిమాలు చూసి ఎంజాయ్‌ చేయాలి’ అంటూ మహేష్ జవాబిచ్చాడు. అదే క్రమంలో మహేష్ కు సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ పై ప్రశ్న ఎదురైంది. 
 
అందుకు మహేష్… “నాన్నగారి బయోపిక్‌ ఎవరైనా చేస్తాను అంటే నేను హ్యాపీనే. కానీ నేను మాత్రం చేయను. ఆయన నాకు దేవుడు. ఆయన జీవిత ప్రయాణాన్ని ఎవరైనా తెరకెక్కిస్తాను అంటే నా బ్యానర్‌లో నిర్మించడానికి రెడీగా ఉన్నాను.బయోపిక్‌ తీసేటప్పుడు బాధ్యతగా బాధ్యతగా వ్యవహరించాలి. ‘మేజర్‌’ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బయోపిక్‌ తీస్తున్నప్పుడు మేము కూడా అలాగే జాగ్రత్త పడ్డాము” అంటూ మహేష్ చెప్పుకొచ్చాడు. ఇక ‘మేజర్’ చిత్రం జూన్ 3న విడుదల కాబోతుంది. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు