అవతార్ – 2.. 13 ఏళ్ల నుంచి ప్రపంచ వ్యాప్తంగా సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న మూవీ. 2009 లో హాలీవుడ్ లేజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ అవతార్ తో సినీ ప్రపంచానికి కొత్త లోకాన్ని పరిచయం చేశాడు. ఆ మూవీకి యావత్ ప్రపంచం ఫీదా అయిపోయింది. దాదాపు అన్ని దేశాల్లో అవతార్ మూవీ రన్ అయంది. దీంతో ప్రపంచలోనేే అత్యధికంగా.. రూ.20 వేల కోట్లను రాబట్టింది. 13 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఎవరూ కూడా టచ్ చేయలేకపోయారు. ఈ మూవీకే సీక్వెల్ గా జేమ్స్ కామెరాన్ అవతార్-2 తెరకెక్కించాడు.
అవతార్ -2.. 2010 లో అనౌన్స్ వచ్చిన నాటి నుంచి పెద్ద అప్ డేట్స్ ఏమీ రాలేదు. కానీ తాజా గా అవతార్ – 2 నుంచి టీజర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. అవతార్ – 1 లో నింగి, నేల గురించి చూపించిన కామెరాన్.. ఇప్పుడు జల ప్రపంచాన్ని చూపించాడు. సముద్రాన్ని కాపాడుకోవడానికి ఫైట్స్ మెస్మరైజ్ చేశాలా.. ఉంటాయని టీజర్ తో తెలుస్తుంది. అలాగే ఈ టీజర్ లో జల ప్రపంచం వేరే లేవెల్ లో ఉంది. విజువల్ వండర్ టీజర్ తో అవతార్ – 2 పై భారీగానే అంచనాలు పెరిగాయి.
కాగ ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా 160 భాషాల్లో రిలీజ్ చేయనున్నారు. అలాగే దీనికి సీక్వెల్ గా అవతార్ 3ని 2024 లో, అవతార్ 4 2026 లో, అవతార్ 5ని 2028 లో రిలీజ్ చేస్తున్నట్టు డైరెక్టర్ జెమ్స్ కామెరాన్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.