నిజానికి ఈ సినిమా పేరు పాకడానికి కూడా ప్రేక్షకులు బాగా ఇబ్బంది పడేవారు. టైటిల్ జనాల్లోకి వెళ్లకపోతే సినిమా ఎలా జనాల్లోకి వెళ్తుంది అని అంతా అనుకున్నారు. కానీ టీవీ 9 లో చోటు చేసుకున్న రచ్చ కారణంగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మూవీకి మంచి పబ్లిసిటీ అయ్యింది. విడుదల రోజు వరకు ప్రతీ ఒక్కరి మైండ్లో ఈ మూవీ గురించే ఆలోచనలు. విశ్వక్ సేన్, రుక్సర్ ధిల్లాన్ జంటగా నటించిన ఈ మూవీ దేవి నాగవల్లి ఇష్యూతో.. ‘అసలు రిలీజ్ అవుతుందా’ అనే డౌట్ లు క్రియేట్ చేసింది. కానీ మొదటి రోజు సినిమాకి మంచి టాక్ రావడంతో డీసెంట్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. రూ.6 టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ.. మొదటి 3 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం : 1.3 కోట్లు
సీడెడ్ : 0.30 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.26 కోట్లు
ఈస్ట్ : 0.14 కోట్లు
వెస్ట్ : 0.12 కోట్లు
కృష్ణా : 0.18 కోట్లు
గుంటూరు : 0.15 కోట్లు
నెల్లూరు : 0.08 కోట్లు
—————————————
తెలంగాణ+ ఏపీ : 2.53 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.10 కోట్లు
ఓవర్సీస్ : 0.05 కోట్లు
—————————————————————–
వరల్డ్ వైడ్ (టోటల్) : 2.68 కోట్లు(షేర్)
ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలబడాలి అంటే ఇంకో రూ.3.32 కోట్ల షేర్ ను రాబట్టాలి.