Bala krishna :నందమూరి ఫామిలీకి విశ్వక్ కి సంబంధం ఏంటి ?

నందమూరి సినిమా ఫంక్షన్ లనుండి మొదలు పెడితే ఫ్యామిలీ ఈవెంట్ ల వరకు అన్నిట్లో జూనియర్ ఎన్టీఆర్ తో సమానంగా పాల్గొంటున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. కోన్ని సందర్బాల్లో నైతే జూనియర్ ఎన్టీఆర్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ విశ్వక్ సేన్ కె లభిస్తుంది. అసలు ఎవరి విశ్వక్ సేన్ ? నందమూరి ఫామిలీకి విశ్వక్ కి సంబంధం ఏంటి ? ఎందుకు బాలకృష్ణ, ఎన్టీఆర్ విశ్వక్ సేన్ కి ఇంతలా సపోర్ట్
చేస్తున్నారు ? అయితే ఇవి అందరిలో ఉన్న ప్రశ్నలే కానీ సమాధానాలు ఎవరు చెప్తారు.

వెళ్ళిపోమాకే సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన విశ్వక్ అసలు పేరు దినేష్ నాయుడు. అయితే విశ్వక్ సేన్ మొదటి సినిమా నిరాశపరచిన తరువాత చేసిన ఈ నగరానికి ఏమైంది సినిమా మంచి విజయం సాధించి, విశ్వక్ కి మంచి పేరు తీసుకొచ్చింది. కానీ ఈ సినిమాలో నలుగురు క్యారెక్టర్ లలో ఒకడిగా చేసిన విశ్వక్ ఆ తరువాత ఫలక్ నామా దాస్ సినిమాలో సోలో హీరోగా చేసాడు. అయితే ఈ సినిమా మంచి సాధించటంతో విశ్వక్ మాస్ హీరో అయ్యాడు. అయితే ఇందులో ఒక చిక్కు ఉంది. ఈ సినిమా హిట్ అవడానికి కథ, కథనం లాంటి విషయాలు పక్కన పెడితే ఈ సినిమా ప్రమోషన్స్ లో విశ్వక్ చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ మరియు గొంతు చించుకొని సినిమా కోసం చేసిన హడావిడి అంత ఇంత కాదు. అప్పుడే మొదటిసారి విశ్వక్ ఎన్టీఆర్ పేరుని, సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకున్నాడు. దాంతో విశ్వక్ కి ఫ్రీ పబ్లిసిటీ రావడంతో పాటు సినిమా హిట్ కి హెల్ప్ అయింది.

ఇక ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో విశ్వక్ టాలీవుడ్ లో బిజీ హీరో అయ్యాడు. అయిన సరే విశ్వక్ కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం , పబ్లిక్ గా బూతులు మాట్లాడటంతో న్యూస్ చానెల్స్ లో హైలెట్ అవుతూ వచ్చాడు. ఎన్టీఆర్ ఫ్యాన్, ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పుకొని ఎన్టీఆర్ కి క్లోజ్ అయ్యి తన ప్రి రిలీజ్ ఈవెంట్ లకి గెస్ట్ గా పిలుచుకున్నాడు. అలాగే బాలకృష్ణతో అన్స్టాపబుల్ షోలో పాల్గొని బాలయ్యతో క్లోజ్ అయ్యాడు. ఇలా నందమూరి ఫ్యామిలీని గట్టిగ వాడుకొని ఏకంగా నిన్న జరిగిన సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో కూడా పాల్గొన్నాడు. ఫ్యామిలీలో ఉన్న విభేదాల కారణంగా సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి ఎన్టీఆర్ రాకపోగా.. విశ్వక్ మాత్రం హాజరయ్యాడు. ఇటీవలనే జరిగిన సింహాద్రి ప్రి రిలీజ్ ఈవెంట్ లో కూడా విశ్వకే చీఫ్ గెస్ట్ గా వెళ్ళాడు. ఇదంతా చూస్తుంటే నందమూరి ఫ్యామిలీకి విశ్వక్ నయా వారసుడు అయ్యేలా ఉన్నాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్టీఆర్ కంటే కూడా బాలకృష్ణ, విశ్వక్ కి ఎక్కువగా సపోర్ట్ చేయడంతో అందరిలో అనుమానాలు రేకెత్తిస్తుంది

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు