NTR Centenary Celebrations: మంచు కుటుంబానికి అవమానం – ఆహ్వానం అందలేదా..?

నందమూరి, మంచు కుటుంబాల మధ్య అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ ఎన్టీఆర్ ను  సొంత సోదరుడిగా భావించే మోహన్ బాబు ఆయన కుటుంబంలో ఒకడిగా మెలుగుతూ వచ్చాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించి పలు పదవులు కూడా అనుభవించాడు. అయితే, తరువాత కాలంలో చంద్రబాబుతో ఏర్పడ్డ విభేదాల కారణంగా పార్టీకి దూరమై వైఎసార్సీపీలో చేరాడు మోహన్ బాబు. రాజకీయంగా పార్టీకి దూరమైనా నందమూరి కుటుంబంతో సన్నిహితంగా ఉండేవాడు మోహన్ బాబు. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మంచు కుటుంబాన్ని నందమూరి కుటుంబం పక్కన పెడుతుందా అన్న కలుగుతోంది.

ఎన్టీఆర్ శతజయంతి సందర్బంగా నిన్న హైదరాబాద్ లో జరిగిన సభకి మంచు కుటుంబం నుండి ఒక్కరు కూడా రాకపోవటం చర్చనీయాంశం అయ్యింది. ఈ సభకి సినిమా ఇండస్ట్రీ నుండి మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీల హీరోలతో పాటుగా అడివి శేష్, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ వంటి యువ హీరోలు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మంచు ఫ్యామిలీకి ఆహ్వానం అందలేదా లేక ఆహ్వానం అందినా కూడా ఎవరూ హాజరు కాలేదా అన్న అనుమానం కలుగుతోంది. అయితే, ఫంక్షన్ కి ముందు హాజరయ్యే అందరు హీరోల ఫోటోలతో బ్యానర్లు కనిపించాయి కానీ, మంచు ఫ్యామిలీ హీరోల ఫోటోలు మాత్రం కనిపించలేదు. దీన్ని బట్టి చూస్తే, మంచు కుటుంబానికి ఆహ్వానం  అందలేదని స్పష్టం అవుతోంది.

కనీసం మా  అధ్యక్షుడి హోదాలో అయినా మంచు విష్ణుకి ఆహ్వానం అందకపోవటం గమనార్హం. తెలుగు జాతికి గర్వకారణం అని చెప్పుకునే ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సాక్షిగా ఈ విభేదాలు బయటపడటం హర్షించదగ్గ అంశం కాదు. మరో పక్క ఎన్టీఆర్,  కళ్యాణ్ రామ్ లు కూడా వేడుకలో కనిపించకపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వివాదంపై మోహన్ బాబు కానీ, బాలకృష్ణ కానీ ఎలా స్పందిస్తారో అన్న ఆసక్తి నెలకొంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు