Pawan Kalyan: తమిళ డైరెక్టర్లతో వస్తున్న బాబాయ్, అబ్బాయ్ – సెంటిమెంట్ బ్రేక్ చేస్తారా..?

ఇటీవల తెలుగు హీరోలు తమిళ డైరెక్టర్లతో కలిసి చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్ తో కలిసి తమిళ నటుడు దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో నటించిన ‘బ్రో’ సినిమా, శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై కూడా ఆ సెంటిమెంట్ ప్రభావం పడుతుందా అన్న ఆందోళన మొదలైంది మెగా అభిమానుల్లో. తమిళ సినిమా వినోదాయ సీతాం కి రీమేక్ గా రూపొందుతున్న బ్రో సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ సినిమాకు పేరుకు మాత్రమే సముద్రఖని డైరెక్టర్ అని, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు అన్నీ తానై వ్యవహరిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని సినిమా యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. దిల్ రాజుకి కథల విషయంలో ఉన్న టేస్ట్, జడ్జిమెంట్ గతంలో చాలా సినిమాల విషయంలో ప్రూవ్ అవ్వటం వల్ల ఈ సినిమాపై మెగా అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

విరూపాక్ష సినిమా ద్వారా బస్టర్  అందుకున్న సాయిధరమ్ తేజ్, బ్రో సినిమాతో కూడా హిట్ అందుకొని  విజయ పరంపర కొనసాగించాలని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. RRR సినిమా ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందిన రామ్ చరణ్ నుండి వస్తున్న పాన్ ఇండియా సినిమా కావటంతో గేమ్ చేంజర్  సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి, తెలుగు హీరోలకు తమిళ దర్శకులు వరుస ఫ్లాప్స్ ఇస్తున్న తరుణంలో వస్తున్న పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ల సినిమాలు ఆ సెంటిమెంట్ ని  బ్రేక్  చేస్తాయా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు