Waltair Veerayya: సెకండ్ సింగిల్ కు ముహూర్తం ఫిక్స్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజు రవితేజ చాలాకాలం తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతున్నారు. అన్నయ్య సినిమాలో మెరిసిన ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ సందడి చేసేందుకు రెడీ అవుతోంది. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్యలో రవితేజ కీలకపాత్రలో కనిపించనున్నారు. రవితేజ ఇందులో ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో కనిపిస్తున్నాడు.

రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది. కాగా వాల్తేరు వీరయ్య లో రవితేజ షూటింగ్ పార్ట్ కు సంబంధించిన స్టిల్స్ కూడా మైత్రి మూవీ మేకర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అటు బాస్ పార్టీ సాంగ్ 25 మిలియన్ల న్యూస్ ను క్రాస్ చేసి రీల్ మేకర్స్ కు ఫేవరెట్ గా మారింది.

ఇప్పుడు సెకండ్ సింగిల్ “నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి” అనే సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈనెల 19వ తేదీన సెకండ్ సింగిల్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు చిరంజీవి మరియు శృతిహాసన్ లా కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. కాగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు