Vishnu Priya : బిగ్ బాస్ కి చచ్చినా వెళ్ళను

విష్ణు ప్రియ భీమినేని.. టాలీవుడ్ బుల్లితెర యాంకర్స్ లో హాటెస్ట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకర్ గా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుని ప్రస్తుతం గ్లామర్ ప్రపంచంలో దూసుకుపోతుంది విష్ణుప్రియ.

మొన్నటివరకు బుల్లితెర యాంకర్ గా రాణించిన విష్ణుప్రియ నేడు బిగ్ స్క్రీన్ పై అవకాశాలను దక్కించుకుంటూ హీరోయిన్ రేంజ్ కి ఎదిగే ప్రయత్నం చేస్తోంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తన పరువాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియకి కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్న ఎదురయింది.

దీనికి ఆమె సమాధానం ఇస్తూ.. ” కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. ఇది ఒక ఇండస్ట్రీలోనే కాక ప్రతి చోటా ఉంది. ఎందుకంటే మెయిల్ డామినేషన్ ఉండడం వల్ల అది ఉంది”. ఇక బోల్డ్ గా నటించడం వల్లే మీకు అవకాశాలు వస్తున్నాయా అన్న ప్రశ్నకి.. “నాకంటే అందమైన వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. మా తల్లిదండ్రులు, ఆ దేవుడి దయ వల్లే నాకు అవకాశాలు వస్తున్నాయి. నాకు టాలెంట్ లేదు అనే విషయాన్ని నేను ఒప్పుకుంటాను. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే అదృష్టం ఉండాలి” అని చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ. ఇక బిగ్ బాస్ కి వెళతారా అన్న ప్రశ్నకి.. చచ్చినా వెళ్లానని సమాధానం ఇచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు