Hit-2: 1 మిలియన్ మార్క్

క్షణం, అమీ తుమీ, గూఢచారి, ఎవరు, మేజర్ వంటి సినిమాలతో వరుస హిట్ల తో ఫుల్ జోష్ లో ఉన్న అడివి శేష్ హిట్ 2 సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. డిసెంబర్ 2న విడుదలైన హిట్ 2 మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ వైపుకు పయనమైంది. మన దేశంతో పాటు అడివి శేష్ కు ఎంతో పట్టు ఉన్న యూఎస్ లో కూడా హిట్ 2 దుమ్ము లేపుతుంది. తాజాగా ఈ చిత్రం యూఎస్ లో అరుదైన ఘనత సాధించింది.

అమెరికాలో అన్ని సెంటర్ లలో కలుపుకుని 1 మిలయన్ డాలర్ల వసుళ్లూ అందుకుంది. ఇంకా ఈ చిత్రానికి థియేటర్ లలో విశేష స్పందన వస్తుంది. దీంతో కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఈ సంవత్సరంలో అడివి శేష్ ఈ ఘనతను రెండు సార్లు సాధించాడు. ఈ ఏడాది అడివి శేష్ నటించిన మేజర్ కూడా అమెరికాలో 1 మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకున్న సంగతి విధితమే. తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ 2 కూడా యూఎస్ లో 1 మిలియన్ డాలర్ల మార్క్ ను టచ్ చేసింది.

దీంతో పాటు హిట్2 మరో రికార్డును కూడా నెలకొల్పింది. యూఎస్ లో 1 మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకున్న రెండో ఏ సర్టిఫికెట్ చిత్రంగా హిట్ 2 నిలిచింది. దీనికి ముందు విజయ్ దేవరకొండ నటించిన ఏ సర్టిఫికెట్ మూవీ అర్జున్ రెడ్డి అమెరికాలో 1 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు