Waltheru Veeraya:రవి తేజ మాస్ ఎంట్రీ

చిరంజీవి ఈ ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఇందులో గాడ్ ఫాదర్ సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఆయన మరో సినిమాతో బిజీగా ఉన్నారు. అదే వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలకపాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాలో చిరంజీవి ఫస్ట్ లుక్, పాటలు విడుదలయ్యాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ప్రస్తుతం ఈ చిత్రం నుంచి రవితేజ టీజర్ ను విడుదల చేసింది చిత్రం బృందం.

టీజర్ చూసిన తర్వాత సినిమాపై ఉన్న హైప్ మరింత పెరిగిపోయింది అని చెప్పాలి. ఇప్పుడు రవితేజ లుక్, తెలంగాణ యాస, రవితేజ మాస్ ఎలివేషన్స్ అన్ని, ఓ రేంజ్ లో హైలెట్ అయ్యాయని చెప్పాలి. సినిమాలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా కనిపిస్తున్న రవితేజ తెలంగాణ స్లాంగ్ తో చెప్పిన డైలాగ్స్ ఊర మాస్ గా ఉండగా బాబీ ఇచ్చిన ఎలివేషన్స్ అలాగే దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన, బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నీ కూడా అదుర్స్ అనిపించాయి.

మొత్తం మీద సినిమా మీద ఆల్రెడీ మంచి అంచనాలే ఉండగా ఇప్పుడు ఆ అంచనాలను ఈ టీజర్ మరింతగా పెంచేసింది అని చెప్పాలి. ఇక వచ్చే సంక్రాంతికి చిరు, రవితేజలు కలిసి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు