Vijay : వారసుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్

తమిళ్ నటుడు విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘వరిసు’. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ కానుంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా, ఎస్. తమన్ మ్యూజిక్ అందించారు.రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై విజయ్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు, తమిళ ఆడియన్స్ అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. వారసుడు సినిమా ప్రమోషన్లను చిత్ర బృందం స్టార్ట్ చేసింది.

ఈ మూవీని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా జనవరి 12 తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉండ,గా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా కోసం భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యూనిట్ తమిళ్ లో భారీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యూనిట్ డిసెంబర్ 24వ తేదీన నెవర్ బిఫోర్ రేంజ్ లో ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఫంక్షన్ నిర్వహించడానికి సన్నాహాలను మొదలుపెట్టినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అంతేకాదు, తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే ప్రకటన రానుందట. ఈ విషయం పై పవన్ తోపాటు దళపతి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు