Hollywood : KGF 2 రికార్డు బ్రేక్ చేసిన అవతార్

ఈ ఏడాది వచ్చిన పాన్ ఇండియా సినిమాలన్నీ రికార్డు బ్రేకింగ్ చిత్రాలుగా నిలిచాయి. ఒక దాని వెనక మరొకటి సంచనాలు సృష్టిస్తున్నాయి. అయితే హాలీవుడ్ చిత్రం అవతార్ 2 తో కూడా ఇదే జరిగింది. అవతార్: ది వే ఆఫ్ వాటర్ అనేది అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం మరియు 2009లో వచ్చిన అవతార్ చిత్రానికి సీక్వెల్, ఈ రెండూ సినిమాలకి జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించారు. భారత్ లో అవతార్ రిలీజ్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా ఈ సినిమాకి సీక్వెల్ అంటే అంచనాలు భారీ స్థాయిలో పెంచేసుకున్నారు.

ఇదిలా ఉండగా కన్నడ ఇండస్ట్రీ నుంచి 2018లో వచ్చిన KGF 1 చిత్రం తక్కువ అంచనాలతో వచ్చి పెద్ద హిట్ అందుకుంది. దీనితో దర్శకుడు ప్రశాంత్ నీల్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెంచుకున్నారు. వారికి న్యాయం చేస్తూ కెజిఫ్ 1కి సీక్వెల్ గా KGF 2 సినిమాను తీశారు ప్రశాంత్.

సినిమా రిలీజ్ అవకముందే KGF 2 ఎన్నో రికార్డులను బద్దలు కొట్టండి.
ఇండియాలో KGF 2 చిత్రానికి 4 లక్షల 11 వేలకి పైగా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. దీని బ్రేక్ చేస్తూ అవతార్: ది వే ఆఫ్ వాటర్
కు ఏకంగా 4 లక్షల 40 వేలకి పైగా టికెట్స్ బుక్ అయ్యాయి. మున్ముదు ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు